మేడారం మహా జాతరలో తొలి ఘట్టం నిర్విఘ్నంగా పూర్తైంది. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ నిన్న (బుధవారం) అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించారు. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం ఇవాళ జరగనుంది.
ఈనెల 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో జరుగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండి రీజ్వితో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిచోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. మెయింటెనెన్స్, ఓవర్ లోడ్…
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈరోజు రిటర్నింగ్ అధికారి నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభకు తనను పంపినందుకు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. రాజ్యసభ ఎంపీ అవ్వడం బహుమతి కాదు.. బాధ్యత పెరిగిందని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనగానే నాయకుల ఇళ్లకు ఈడీ అధికారులు…
ఎన్నికల షెడ్యూల్ కు గడువు మరో పక్షం రోజులే ఉన్నందున ఆ లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తుశుద్దిని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా కన్పిస్తోందన్నారు. ‘‘6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు 70 రోజుల గడువు ముగిసింది. నెలాఖరు…
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిసారీ తల్లులను వనంలో నుంచి గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు తాను ఉంటున్నాని తెలిపారు. ఈసారి తన ఆధ్వర్యంలో తీసుకురావడంత ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే.. మేడారం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా.. భక్తులు తల్లులను దర్శించుకునే సమయంలో క్యూలైనల్లో…