Road Accident: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తోన్న ఓ ఎస్సై సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. భూత్పూర్ మండలం అన్నాసాగర్ దగ్గర నేషనల్ హైవే 44పై ప్రయాణిస్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది.. లారీనీ ఓవర్‌టేక్ చేస్తుండగా.. చెట్టును ఢీకొట్టింది కారు.. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరికి సీరియస్‌గా ఉంది.. మృతుల్లో నంద్యాల జిల్లా రాచర్ల ఎస్సై వెంకటరమణ, అతడి అల్లుడు, కారు డ్రైవర్ ఉన్నారు. అయితే, ఈ నెల 14వ తేదీన తన కుమార్తె వివాహాన్ని జరిపించాడు ఎస్సై.. ఇంతలోనే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు కారు వెళ్తుండగా.. జరిగిన ఈ ప్రమాదంలో నవ వరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: Minister Jogi Ramesh: నారా భువనేశ్వరి అసలు విషయం పసిగట్టారు.. అందుకే పోటీ అంటున్నారు..!