తెలంగాణ ప్రజలకు చల్లని వార్త..పగలంతా ఎండవేడి, ఉక్కపోత ఉంటే,.. రాత్రి చలి తీవ్రత కొనసాగుతుంది. ఇలాంటి టైమ్‌లో వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.. రాష్ట్రంలో మరోసారి వర్షాలు పలకరించబోతున్నాయి.. నేడు, రేపు రాష్ట్రంలో తేలిక పాటి జల్లులుతో పాటు మోస్తారుగా వర్షాలు కురవనున్నాయి.. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని…
తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కోడ్ మారనుంది. ప్రస్తుతం టీఎస్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక టీజీగా మారబోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నేడో, రేపో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఎమ్మెల్యే లాస్య మృతిపై కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ తెలిపారు. ఉదయం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని.. డ్రైవర్ ఆకాష్ అకస్మాత్తుగా నిద్రమత్తులోకి జారడం వల్ల డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడని వెల్లడించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు.
బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని.. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మీద ఏదో ఒక నింద వేయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు.