రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం(చౌటుప్పల్-అమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి, పలు…
రైతులు పంట వేసిన రోజు నుండి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులకు అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కేవలం ఒకటి లేదా రెండు పంటల కొనుగోళ్లు చేసి మిగతా పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో.. గత ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి కారణంగా రాష్ట్రములో 75 శాతం సాగు విస్తీర్ణము రెండు, మూడు పంటల క్రిందకు వచ్చిందన్నారు. ఈ పరిస్థితిని నివారించి అన్నీ…
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సీట్లకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాగా.. రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రేణుకా చౌదరి తీసుకోనున్నారు. మరోవైపు.. అనిల్ కుమార్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు.
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రెండో రోజు వాడివేడిగా సాగుతోంది. ఇవాళ ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం జరిగింది.
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే వెళుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
BJP Vijaya Sankalpa Yatra: రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగానే నేటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు.