తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈరోజు రిటర్నింగ్ అధికారి నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభకు తనను పంపినందుకు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. రాజ్యసభ ఎంపీ అవ్వడం బహుమతి కాదు.. బాధ్యత పెరిగిందని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనగానే నాయకుల ఇళ్లకు ఈడీ అధికారులు చేరుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్లు ఇదే చూశాం.. ఇక పై సాగనివ్వమని అన్నారు. మరోవైపు.. దేశంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Basti Me Sawal: ‘బస్తీమే సవాల్’.. మీలో టాలెంట్ ఉంటే.. మాకు ఫోన్ చేయండి..
మరోవైపు.. నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరితే గాంధీభవన్ లో కుర్చీ ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. గాంధీభవన్ లో చాలా కుర్చీలున్నాయన్న రేణుకా.. సీటు విషయంలో మాత్రం కుదరదని చెప్పారు. ఖమ్మం సీటును ఈసారి గెలిచే వారికే ఇవ్వాలని ఆమె కోరారు. ఖమ్మంలో ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఖమ్మంలో చోటులేదని ఆమె తెలిపారు.
Bandi Sanjay: చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లో హామీలను అమలు చేయండి..
కాగా.. రేణుకా చౌదరితోపాటు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికైనట్లు మంగళవారం రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో గడువు ముగిసిన నేపథ్యంలో ఈ ముగ్గురిని తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ప్రకటించారు.