మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టనుంచి కుంకుమ భరణి రూపంలో బయల్దేరి వచ్చిన సమ్మక్క.. గద్దెకు చేరుకుంది. సమ్మక్కను ప్రధాన పూజారి ప్రతిష్టించారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించే సమయంలో లైట్లు నిలిపివేశారు. మరోవైపు.. అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించే సమయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించడంతో భారీ ఎత్తున భక్తులు జై సమ్మక్క తల్లి-జై సారక్క తల్లి అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు…
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారు…
గొర్రెల పంపిణీ అవకతవకల్లో ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు. వారిలో కామారెడ్డి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. గొర్రెల పంపిణీలో…
రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై సీఎం విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్తో పొత్తు విషయంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. లోక్ సభలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ తేల్చాలి అని అన్నారు. కాంగ్రెస్తో పొత్తు ఉండాలని ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కమ్యునిస్టులతో కలిసి పనిచేయాలని…
Tunnel Roads: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైతే రాత్రి 10 గంటల వరకు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు దర్శనమిస్తున్నాయి.