వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మన ప్రభుత్వం పోయి నాలుగు నెలల్లో ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం తెలంగాణ భవన్లో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు.
మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్తితుల కారణంగా వేసవిలో నీటి సరఫరా చాలా కీలకమని, అన్ని గ్రామీణ ఆవాసాలలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయడం ఈ శాఖ బాధ్యత అని ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు.
Hit and Run: కొందరు యువత సెల్ఫీల కోసం ప్రమాదకర పనులు చేస్తుంటారు. కొంత మంది లైక్స్ రావడానికి.. ఫేమస్ కావడానికి రీళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు.
BJP Tiffin Box Baithaks: నేడు బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో టిఫిన్ బాక్స్ బైఠక్లు నిర్వహించనుంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి జి.కిషన్రెడ్డితో పాటు అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు తమ తమ పోలింగ్ బూత్ కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలు, పోలింగ్ బూత్ల వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కాగా, రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలోని పోలింగ్…