2026 Renault Duster: రెనాల్ట్ ఇండియా ఎట్టకేలకు కొత్త తరం (New-Gen) రెనాల్ట్ డస్టర్‌ను భారత మార్కెట్ కోసం అధికారికంగా లాంచ్ చేసింది. లాంచ్‌కు ముందే ఈ SUV పూర్తి స్థాయి డిజైన్, పూర్తిగా మారిన ఇంటీరియర్ మరియు ఆధునిక పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ఆకట్టుకున్నది. ఇప్పటికే రూ.21,000తో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముందస్తు బుకింగ్ చేసుకునే వారికి డెలివరీ, ప్రత్యేక ప్రారంభ ధరలు, ఇంకా ‘Gang of Duster’ ఎక్స్‌క్లూజివ్ మెర్చండైజ్ వంటి ప్రయోజనాలు అందించనున్నారు.
2026 రెనాల్ట్ డస్టర్ ఇంజిన్ & పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు:
భారత్‌కు ప్రత్యేకంగా రూపొందించిన కొత్త రెనాల్ట్ డస్టర్ అనేక ఇంజిన్ ఆప్షన్ లతో రానుంది. టాప్ వేరియంట్‌గా 1.8 లీటర్, నాలుగు సిలిండర్ల డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ (E-Tech 160) అందుబాటులోకి రానుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటర్లతో కలిసి 160 bhp పవర్, 172 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే కాకుండా.. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ (Turbo TCe 160) – 160 bhp పవర్, 280 Nm టార్క్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు DCT గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది.

అలాగే 1.0 లీటర్ మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ (TCe 100) 100 bhp పవర్, 160 Nm టార్క్, కేవలం 6-స్పీడ్ మాన్యువల్‌తో, ఇంకా మరో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ – 163 hp పవర్, 280 Nm టార్క్ వంటి విభిన్న పవర్‌ట్రెయిన్‌లు డస్టర్‌ను సిటీ డ్రైవ్ నుంచి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ వరకు అన్ని అవసరాలకు సరిపోయే SUVగా మార్చనున్నాయి.
ఎక్స్‌టీరియర్ డిజైన్:
కొత్త డస్టర్ గ్లోబల్ థర్డ్-జెన్ మోడల్ సిల్హౌట్‌ను నిలుపుకుంటూనే, భారత మార్కెట్ అభిరుచులకు తగ్గట్టుగా ప్రత్యేక మార్పులతో వచ్చింది. ముందుభాగంలో ఐబ్రో-స్టైల్ LED DRLsతో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి. ప్రత్యేకమైన గ్రిల్‌పై డస్టర్ బ్యాడ్జ్, వెండి రంగు సర్‌రౌండ్‌తో బంపర్ ఇవన్నీ ఫస్ట్-జెన్ డస్టర్‌ను గుర్తు చేసేలా ఉన్నాయి. పిక్సెల్ డిజైన్ ఫాగ్ ల్యాంప్స్ SUVకి మరింత రగ్డ్ లుక్‌ను ఇస్తాయి.

సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ క్లాడింగ్, C-పిల్లర్‌లో దాగిన రియర్ డోర్ హ్యాండిల్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ కనిపిస్తాయి. వెనుక భాగంలో ఇండియా-స్పెక్‌కు మాత్రమే ప్రత్యేకమైన కనెక్టెడ్ LED టెయిల్‌లైట్స్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, రియర్ వైపర్, వెండి ఇన్సర్ట్‌తో బంపర్ డిజైన్ డస్టర్‌ను మరింత స్టైలిష్‌గా మార్చాయి.
ఇంటీరియర్ & ఫీచర్లు:
కొత్త రెనాల్ట్ డస్టర్ ఇంటీరియర్‌లో ప్రీమియం ఫీలింగ్‌తో పాటు లేటెస్ట్ టెక్నాలజీ కనిపిస్తుంది. కొత్త త్రి-స్పోక్ స్టీరింగ్ వీల్, పియానో బ్లాక్ ఫినిష్, డ్యూయల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, అంబియంట్ లైటింగ్, టైప్-C ఛార్జింగ్ పోర్ట్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఆటో హోల్డ్‌తో), ఫాక్స్ కార్బన్ ఫైబర్ డిటేలింగ్ మరియు పానోరామిక్ సన్‌రూఫ్ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
మిలానో కార్టినా 2026 కోసం Samsung Galaxy Z Flip7 ఒలింపిక్ ఎడిషన్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!
ఇక ఫీచర్ల జాబితాలో:
* 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ (వైర్లెస్ Android Auto & Apple CarPlay)
* 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (Google OS)
* డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్
* 6-వే పవర్డ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
* వైర్లెస్ ఛార్జర్, పవర్డ్ టెయిల్‌గేట్
* 360-డిగ్రీ కెమెరా, Arkamys ఆడియో సిస్టమ్
* 6 ఎయిర్‌బ్యాగ్స్ & లెవల్-2 ADAS

ధర & ప్రీ-బుకింగ్ వివరాలు:
కొత్త రెనాల్ట్ డస్టర్‌ను రూ.21,000తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. అధికారిక ధరలను మార్చి 2026 మధ్యలో ప్రకటించనున్నారు. టర్బో పెట్రోల్ వేరియంట్ డెలివరీలు మార్చి మధ్య నుంచి ప్రారంభమవుతాయి. హైబ్రిడ్ వేరియంట్ల డెలివరీలు దీపావళి 2026 నుంచి మొదలవుతాయి. కొత్త డిజైన్, హైబ్రిడ్ టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు మరియు రెనాల్ట్ విశ్వసనీయతతో 2026 రెనాల్ట్ డస్టర్ భారత SUV మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయనుంది.
Rugged SUV design, new front grille, Turbo TCe 160 hp DCT, openR link with Google built-in, 17 advanced safety features, and a 518L boot with electric tailgate.
Pre-order now with Duster R:pass for priority delivery: https://t.co/a5a6nN0HTo#Renault #Duster pic.twitter.com/27VRR6RJmt— Renault India (@RenaultIndia) January 26, 2026