Jowar Flour Paratha Recipe: నిజానికి రొట్టెలు చేయడం అందరి వల్ల సాధ్యం అయ్యే పని కాదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. అయితే జొన్నపిండితో పరాటాలు చేయడం చాలా సులభం అని తెలుసా..? ఇవి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ లేదా డిన్నర్ లోకి ఎంతో రుచిగా, సాఫ్ట్ గా బాగుంటాయి. కొద్దీ నిమిషాల్లో తయారయ్యే వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
రిసైకిల్ మెటీరియల్ + కలర్ ఫుల్ ప్రీమియం డిజైన్ తో Apple Unity Connection బ్యాండ్ లాంచ్.!
కావలసిన పదార్థాలు:
* జొన్నపిండి – 1 కప్పు
* గోధుమపిండి – పావు కప్పు (బైండింగ్ కోసం)
* సన్నగా తరిగిన మెంతికూర – 1 కప్పు
* సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 1 (చిన్నది)
* ధనియాల పొడి – 1 టీస్పూన్
* కారం – అర టీస్పూన్
* వాము – కొద్దిగా
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర స్పూన్
* జీలకర్ర పొడి – అర స్పూన్
* పెరుగు – 2 నుండి 3 టేబుల్ స్పూన్లు
* నూనె లేదా నెయ్యి – కాల్చడానికి సరిపడా
* ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం:
పిండిని కలుపుకోవడం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జొన్నపిండి, గోధుమపిండి, మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, కారం, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు వేయడం వల్ల పరాటాలు మృదువుగా వస్తాయి.
ముద్దగా చేయడం: పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చివరగా ఒక టీస్పూన్ నూనె వేసి పిండిని సాఫ్ట్‌గా అయ్యేలా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి.
పరాటాలను ఒత్తడం: పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని, పొడి పిండి చల్లుకుంటూ చపాతీల్లా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉంటేనే రుచిగా ఉంటాయి. మీకు రౌండ్ షేప్ సరిగ్గా రాకపోతే, ఏదైనా బాక్స్ మూతతో కట్ చేసి చక్కని ఆకారాన్ని పొందవచ్చు.
కాల్చే విధానం: స్టవ్ మీద పెన్నం పెట్టి వేడి అయ్యాక, పరాటాను వేసి రెండు వైపులా నెయ్యి లేదా నూనె రాస్తూ కాల్చుకోవాలి. మంటను మీడియం నుండి హై ఫ్లేమ్‌లో ఉంచి, పరాటా పై మంచి రంగు వచ్చే వరకు ఎర్రగా కాల్చుకోవాలి. అంతే సాఫ్ట్‌గా, టేస్టీగా జొన్నపిండి పరాటా రెడీ.