Srinivas Goud: ఎన్నికల హామీలను కాంగ్రెస్ మరిచిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండుర్‌లో ఎండిన పంటలకు ఎకరానికి 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రైతు దీక్ష కార్యక్రమం చేపట్టింది., మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, రసమయి బాలకిషన్, పలువురు నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కరవు వచ్చిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు కరవు రాలేదన్నారు. గత పదేళ్లలో రైతులకు కష్టాలు రాలేదని.. కాంగ్రెస్ వచ్చిన వంద రోజుల్లోనే కష్టాలు వచ్చి పడ్డాయని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిందని పేర్కొన్నారు. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్‌ను గద్దె దింపుదామా అని ఎదురుచూస్తున్నారన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Also Read
ఎండిన పంటలకు నష్టానికి ఎకరానికి రైతులకు రూ.25000 వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రకారం యాసంగి సీజన్ నుంచి రైతులకు 500 బోనస్ ఇవ్వాలని కోరారు. చివరి దశలో ఉన్న పంటలను కాపాడేందుకు రైతులకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే తక్షణమే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. రైతుల పక్షాన ముందు ముందు ఏ పోరాటానికైనా బీఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని నాయకులు ప్రకటించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!