నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ఒకేరోజు రెండుసార్లు సాంకేతిక లోపంతో నిలిచి పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగు నీరు, విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల అవినీతిపై విచారణ చేపడితే కేసీఆర్‌కు వణుకు పుడుతోందని ఆయన విమర్శించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ వట్టిమాటలు చెబుతున్నదన్న నేతలకు మా పథకాలే సమాధానమని వ్యాఖ్యానించారు.
ఒక్క పన్ను పాడైతే అన్ని పీకేసుకుంటామా, ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారని, ముఖ్యమంత్రి భాషపైన నిన్నటి కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ సమాజం చీదరించుకుని ఓడగొట్టినా కేసీఆర్‌కు బుద్ధిలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్‌ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రైతు బజార్ పేరిట భారీ అవినీతికి తెరలేపారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ కొంత మంది కౌన్సిలర్లు. నార్సింగ్ మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ప్రతి ఏడాది నిర్వహించవలసిన వేలంపాటను నిర్వహించకుండా నార్సింగ్ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారు.
వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కొత్త కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
Telangana Student Died in US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన పిట్టల వెంకట రమణ (27) మరణించాడు. మార్చి 9వ తేదీన విస్టిరీయా ద్వీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇండియానా పోలీస్‌లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్లో వెంకట రమణ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. వెంకట రమణ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు కారణాలతో ఎనిమిది మంది…