PM Modi: నేడు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ జగిత్యాలల జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి జగిత్యాలకు ప్రధానమంత్రి మోడీ బయలుదేరానున్నారు.
Petrol-diesel Rates: పెట్రోల్-డీజిల్ రేట్లతో అల్లాడుతున్న జనాలకు కేంద్రం ఇటీవల తీపి కబురు చెప్పింది. లీటర్‌పై రూ.2 తగ్గించింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎంత తగ్గించినా, రేట్లు మాత్రం ఇంకా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనే ఇంధన ధరలు ఎక్కువగా ఉండగా.. అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. స్థానికంగా…
PSC Group-1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఈ నెల 14 వరకు అవకాశం ఇచ్చిన టీఎస్ పీఎస్సీ....
TS Tenth Exams 2024: పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాసే సమయం రానే వచ్చింది. రేపటి నుంచి టెన్త్ విద్యార్థులకు పరీక్షలు షురూ కానున్నాయి. అయితే విద్యార్థులు అధికారులు ఇచ్చిన గైడ్ లైన్స్ అనుసరించాలని సూచిస్తున్నారు.
Aroori Ramesh: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
Telangana: లోక్‌సభ షెడ్యూల్ విడుదలైంది. ఇక పోరు మిగిలింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో ఇకపై తెలంగాణలో పోరు మరింత హీటెక్కనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ పర్యటన తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. మార్చి 15న హైదరాబాద్ ప్రచారానికి అమిత్ షా రాబోతున్నారు. మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ…
ఏపీతో పాటు తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడి స్థానం ఖాళీ కాగా.. ఆ అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Group-1 Exam: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అప్లికేషన్లకు గడువు ఈ నెల 14నే ముగిసినా.. TSPSC రెండు రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే.