అదే విధంగా వరి ఎక్కువ పండించే రాష్ట్రం ఏదంటే అక్కడ కూడా తెలంగాణనే ముందుంది.. ఈ ఘనత కేసీఆర్ దే అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టినందుకు గ్రామాల్లో ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు.
గతంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యం ఏలింది అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గతంలో చేసిన తప్పులను రిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది తెలిపారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ లలో నీళ్లు లేవు.. నాగార్జున సాగర్ లో గేట్లు ఎత్తిన నీళ్ళు రాని పరిస్థితి నెలకొంది.. ఈనాడు మంచి నీళ్లను ప్రక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది.