Apple AirTag launch: యాపిల్ (Apple) నుండి ట్రాకింగ్ యాక్సెసరీ ఎయిర్ ట్యాగ్ (AirTag) రెండో తరం (Second Generation)ను అధికారికంగా లాంచ్ చేసింది. డిజైన్ పెద్దగా మారనప్పటికీ.. ముఖ్యమైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో ఈ కొత్త ఎయిర్ ట్యాగ్ మరింత శక్తివంతంగా మారింది. ఎక్కువ దూరం నుంచి ట్రాక్ చేయడం, స్పష్టంగా వినిపించే ఆడియో, ఆపిల్ వాచ్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు అప్గ్రేడ్ అయ్యాయి.
ఈ కొత్త ఎయిర్ ట్యాగ్లో ఆపిల్ రెండో తరం అల్ట్రా వైడ్ బ్యాండ్ (UWB) చిప్ ను ఉపయోగించారు. ఇదే టెక్నాలజీ ఐఫోన్ 17 సిరీస్, లేటెస్ట్ ఆపిల్ వాచ్ మోడల్స్‌లో కూడా ఉంది. దీని వల్ల ట్రాకింగ్ ఖచ్చితత్వం బాగా పెరిగనుంది.
Groom Becomes Father: శోభనం రాత్రే తండ్రైన పెళ్లికొడుకు.. ఎలాగంటే..?
హైలైట్ ఫీచర్స్:
50% ఎక్కువ Precision Finding రేంజ్: మొదటి తరం AirTagతో పోలిస్తే మరింత దూరం నుంచే వస్తువును గుర్తించవచ్చు
అప్‌గ్రేడెడ్ బ్లూటూత్ చిప్: Find My నెట్‌వర్క్‌లో డిటెక్షన్ రేంజ్ పెరుగుతుంది
50% లౌడర్ స్పీకర్: సోఫా, బ్యాగ్ లోపల లేదా ఎక్కడైనా సులభంగా వినిపిస్తుంది
Apple Watch సపోర్ట్: Apple Watch Series 9, Ultra 2 నుంచే Precision Finding ఉపయోగించవచ్చు
ఎయిర్లైన్స్: దీనితో నేరుగా లగేజ్ ట్రాకింగ్ చేయవచ్చు.
షేర్ ఐటమ్ లొకేషన్: దీని ద్వారా AirTag ఉన్న వస్తువు లొకేషన్‌ను తాత్కాలిక లింక్ ద్వారా ఇతరులతో సురక్షితంగా షేర్ చేయవచ్చు. ఇందుకోసం యాపిల్ 50కుపైగా అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యం చేసుకుంది.
స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్, ADAS ఫీచర్లతో 2026 Renault Duster వచ్చేసింది.. ఫీచర్స్ ఇవే..!
కొత్త AirTagలో కూడా యాపిల్ తన కఠినమైన ప్రైవసీ ప్రమాణాలను కొనసాగిస్తోంది. ఇందులో ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ (End-to-End Encryption)తో లొకేషన్ డేటా, తెలియని ఎయిర్ ట్యాగ్ మీతో కదిలితే అన్ వాంటెడ్ ట్రాకింగ్ అలర్ట్స్ అందిస్తుంది. తరచూ మారే బ్లూటూత్ ఐడెంటీఫైర్లు.. ఎయిర్ ట్యాగ్లో లొకేషన్ హిస్టరీ స్టోర్ చేయకపోవడం వంటివి కొనసాగిస్తున్నారు.
ఇక దీని ధర విషయానికి వస్తే.. ఒక ఎయిర్ ట్యాగ్ ధర రూ. 3,790 ఉండగా.. అదే 4 AirTags ప్యాక్ కేవలం రూ.12,900 లకు లభిస్తుంది. అలాగే ఎయిర్ ట్యాగ్ ఫైన్ ఓవెన్ కీ రింగ్ ధరను రూ.3,900 లభిస్తుంది. ఇది ఫాక్స్ ఆరంజ్, మిడ్ నైట్ పర్పుల్, నేవీ, మోస్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ కొత్త ఎయిర్ ట్యాగ్ ను ఆపిల్ వెబ్ సైట్, ఆపిల్ స్టోర్ యాప్‌లో ఆర్డర్ చేయవచ్చు. ఈ వారం చివరికి ఆపిల్ స్టోర్ల్ లలో కూడా అందుబాటులోకి రానుంది.