Off The Road: వీధికెక్కుతున్న మన్యం జిల్లా టీడీపీ అంతర్గత పోరు..!
- మన్యం జిల్లా టీడీపీ మీద అచ్చెన్న పట్టు బిగిస్తున్నారా?..
- అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఉన్నవాళ్ళు మంత్రి మనుషులేనా?..
- భవిష్యత్ రాజకీయ సమీకరణలకు పునాది పడుతోందా?..
- అచ్చెన్న నిర్ణయాలపై జిల్లా ఎమ్మెల్యేల అసహనం?..
- పార్టీ పదవుల రూపంలో కొత్త పవర్ సెంటర్స్ ఆందోళన..
- జూనియర్ ఎమ్మెల్యేలు మాట వినడం లేదన్న అభిప్రాయం?..
- గ్రూప్ రాజకీయాలకు చెక్‌పెట్టే ప్లాన్ అంటున్న అచ్చెన్న వర్గం..
- వీధికెక్కుతున్న మన్యం టీడీపీ అంతర్గత పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Road: పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా తేజోవతి, ఉపాధ్యక్షుడిగా దత్తి లక్ష్మణరావును నియమించాకే ఈ చర్చ ఊపందుకుందట. ఈ ఇద్దరు నాయకులు ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడికి సన్నిహితులని, నియామకాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారన్న టాక్ బలంగా ఉంది. ఇద్దరి మీద అచ్చెన్న వర్గ ముద్ర ఉంది. దీంతో జిల్లా మీద పట్టు బిగించేందుకు మంత్రి వేరేవాళ్ళకు అవకాశాలు రాకుండా… తన మనుషుల్ని మాత్రమే ప్రమోట్ చేసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాజకీయంగా ఆయన సామాజికవర్గం కూడా మరింత బలపడుతోందన్న భావనకొంతమంది నేతల్లో ఉందట. ఇది కేవలం పార్టీ పదవుల వ్యవహారం కాదని, భవిష్యత్తు రాజకీయ సమీకరణలకు పునాది అన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. ఈ పరిణామాలను ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులుగా తామే జిల్లా రాజకీయాలకు కేంద్రంగా ఉండాల్సిన దశలో, తమను పక్కన పెడుతున్నారని, పార్టీ పదవుల రూపంలో కొత్త పవర్ సెంటర్స్‌ను తయారు చేస్తున్నారన్న అసహనం ఎమ్మెల్యేల్లో పెరుగుతోందట. ఇక దీనికి సంబంధించిన మరో కొత్త కోణం గురించి కూడా చర్చ నడుస్తోంది.
Read Also: Smartphones: రూ.20 వేల రేంజ్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్..? ఈ మొబైల్స్ పై ఓ లుక్కేయండి
Also Read
ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు కూడా తమ మాట వినకుండా ఎదురుతిరుగుతున్నారన్న అభిప్రాయం కొందరు సీనియర్స్‌లో ఉన్నట్టు తెలిసింది. దానికి సంబంధించే అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని, అదే కారణంతోనే తమను ఇబ్బందులు పెడుతున్నారన్న భావన ఎమ్మెల్యేల్లో బలంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి వాళ్ళ సన్నిహిత వర్గాలు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళను పక్కనపెట్టి పార్టీ పదవుల ద్వారా సమాంతర శక్తుల్ని తయారు చేయడం అంతర్గత సమతుల్యతకు ప్రమాదకరమన్న అభిప్రాయం జిల్లా టీడీపీలోని ఒక వర్గంలో ఉందంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో టికెట్ల పంపకం, స్థానిక సంస్థల ఎన్నికలు, పవర్ షేరింగ్ లాంటి విషయాలపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే… అచ్చెన్న వర్గం వాదన మరోలా ఉంది. పార్టీ నేతల్ని క్రమశిక్షణలో పెట్టడం, సీనియర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టడమే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అచ్చెన్నాయుడి లక్ష్యమని, అంతకు మించి వేరే ఉద్దేశ్యాలు లేవన్నది మినిస్టర్ సన్నిహితుల మాట. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం విశ్వసనీయులైన నాయకుల్ని ముందుకు తెస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి తేజోవతి, దత్తి లక్ష్మణరావు నియామకాలతో పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇది కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమేగాక….కులం కలర్ కూడా వచ్చేయడంతో… భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!