సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఓటేసేందుకు వెళ్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాల గురించి మాట్లాడారని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల వేళ హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్లిన ఓ మహిళ గుండె పోటుతో మృతి చెందింది. భరత్ నగర్‌కి చెందిన విజయ లక్ష్మి.. ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారు. పోలింగ్ సిబ్బంది, స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో విజయ లక్ష్మి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు.
CM Revanth Reddy Cast his Vote: ఓటు వేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌కు వెళ్లారు. జిల్లా పరిషత్ స్కూలులోని పోలింగ్ కేంద్రంలో రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం సతీమణి, ఆయన కూతురు కూడా కొడంగల్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డి తన వేలిని మీడియాకి చూపించారు. ఆపై అక్కడి స్థానికులతో సీఎం మాట్లాడారు. తాను ఓటు వేశానని, అందరూ తమ ఓటు హక్కును…
తెలంగాణ వ్యాప్తంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఒకట్రెండు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం జరుగుతున్నట్లు సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన అశ్వరావుపేట నెహ్రూ నగర్లో చోటు చేసుకుంది. అశ్వరావుపేట నెహ్రూ నగర్ 165 పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ…
సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ సతీమణి శోభ కూడా చింతమడకలో ఓటు వేశారు. ఈ సమయంలో కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కేసీఆర్‌ను కలిసేందుకు చింతమడక గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఓటు వేసిన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోంది. 65-70 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉంది’…
Chiranjeevi Cast vote in Hyderabad: తాజాగా ఢిల్లీలో పద్మ విభూషణ్ అందుకుని హైదరాబాద్ తిరిగివచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మెగాస్టార్ ఓటు వేశారు. చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా జూబ్లీ క్లబ్‌కు వచ్చి ఓటేశారు. చిరంజీవి భార్య సురేఖ, కూతురు సుస్మితలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ క్యూలో నిలబడి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి…
నేడు తెలంగాణలో లోక్‌సభ పోలింగ్ నేపథ్యంలో రైతులు ధర్నాకు దిగారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామ రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలు చేస్తేనే.. ఓటు వేస్తాం అని తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రం దగ్గర నిరసన తెలిపారు. దాంతో కనుముక్కల గ్రామంలో ఇంకా పోలింగ్ ఆరంభం కాలేదు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్ మండలం రాయమాదారం గ్రామ ప్రజలు లోక్‌సభ పోలింగ్‌ను బహిష్కరించారు.…