Yuvraj Singh: “నాకు సపోర్ట్, రెస్పెక్ట్ రెండూ లేవు”.. రిటైర్మెంట్‌కు అసలు కారణాన్ని వెల్లడించిన యువరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh: యువరాజ్ సింగ్ పేరు వినగానే భారత క్రికెట్ అభిమానుల కళ్ల ముందు ఒక ఫైటర్ కనిపిస్తాడు. మైదానంలో ఆగ్రహం, ఆత్మవిశ్వాసం, మ్యాచ్‌ల్లో పెద్ద షాట్లకు యువరాజ్ ప్రసిద్ధి. కానీ ఆ హీరో వెనక దాగి ఉన్న బాధ, ఒంటరితనం, మౌన పోరాటం గురించి చాలా మందికి తెలియదు. తాజాగా సానియా మీర్జాతో ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ తన మనసులోని మాటలను తొలిసారి ఓపెన్ అయ్యాడు. 2019లో వన్డే వరల్డ్ కప్ నడుస్తున్న సమయంలోనే యువరాజ్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒక్కసారిగా రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఈ పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ వెల్లడించాడు.
READ MORE: Yuvraj Singh: మ్యాచ్ సమయంలో అమ్మాయికి హాగ్, వివాదం.. అసలు విషయం చెప్పిన యువరాజ్!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత యువరాజ్‌ను జట్టులోకి తీసుకోలేదు. ఎవరూ తనతో మాట్లాడటం లేదన్న బాధ కలిగిందట. ఎవరూ తన ఆటను గౌరవించడం లేదని బాధ పడ్డాడట. సపోర్ట్ లేదు, రెస్పెక్ట్ లేదని వెల్లడించాడు. అంతేకాదు.. శారీరకంగా, మానసికంగా అలసిపోయినట్లు అనిపించిందట. ఆడటంలో ఆనందం, గౌరవం లేకపోతే ఆ ఆటను వదిలేయడమే మంచిదని తన రిటైర్మెంట్ వెనుక అసలు కారణాన్ని యువరాజ్ బయటపెట్టాడు. భవిష్యత్తులో సెలెక్షన్ కమిటీ లేదా అడ్మినిస్ట్రేషన్‌లోకి వస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం తన పిల్లలే తన ప్రపంచం అని, వాళ్లతో సమయం గడిపేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపాడు. ఐపీఎల్‌లో కోచ్‌గా లేదా మెంటర్‌గా యువ ఆటగాళ్లతో పని చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. అంతేకాదు.. తనకు చిన్నప్పుడు తాను క్రికెటర్ కావాలని కోరుకోలేదట. టెన్నిస్, రోలర్ స్కేటింగ్ అంటే చాలా ఇష్టమని యువరాజ్ తెలిపాడు. క్రికెట్ తన మీద రుద్దబడిందని చేదు నిజాన్ని వెల్లడించాడు. తండ్రి యోగరాజ్ సింగ్ ఒక దశలో తండ్రికన్నా కోచ్‌లా మారిపోయారని చెప్పాడు.
READ MORE: Gongura Pulihora Recipe: నోట్లో నీళ్లు తెప్పించే గోంగూర పులిహోర.. సులువుగా ఇలా చేసేయండి అంతే.!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..