తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు తెచ్చి పెట్టాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీఆర్ఎస్.. బీజేపీకి ఓట్లు పోలరైజ్ కాలేదు.. బీఆర్ఎస్ కు ఎక్కడ డిపాజిట్లు కోల్పోలేదు.. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఐక్యైత లేదు.. కాంగ్రెస్ వామపక్షాలకు అన్యాయం చేసింది అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ వారికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చి తప్పు చేసింది.. ఎక్కడైతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారో వాళ్ళే ఓడిపోయారు అంటూ నారాయణ ఆరోపించారు.
Read Also: DELHI: ఎయిర్ కెనడా విమానానికి బాంబు బెదిరింపు.. కట్ చేస్తే..
ఇక, ఏపీలో చంద్రబాబు ముందుగా జగన్ కు ధన్యవాదాలు చెప్పాలి అని సీపీఐ నారాయణ అన్నారు. జగన్ ఇంటికి వెళ్లి బాబు విష్ చేయాలన్నారు. అందరికంటే జగన్ ఎక్కువ కష్ట పడ్డాడు.. వామపక్షాల ఓట్ల శాతం పెరిగిందన్నారు. అలాగే, ఏపీలో ఎవరికి అంతుపట్టని ఫలితాలు వచ్చాయి.. గెలిచిన చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ కు అభినందనలు.. కాగా, జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఎన్డీయే కూటమికీ కలిసి వచ్చింది అన్నారు. మోడీకి చంద్రబాబు, నితిష్ కుమార్ లేక పోతే ప్రధాని కాలేడూ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఖచ్చితమైన ప్రతిపాదన చంద్రబాబు కేంద్ర దగ్గర పెట్టాలి..విభజన హామీలు నెరవేర్చుకోవాలి.. ఏపీకి ఫండ్స్ ఇప్పించూకోవాలి.. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేలా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి.. గత ప్రభుత్వం చేసిన పొరపాటను చంద్రబాబు గుణపాఠంగా తీసుకోవాలని నారాయణ చెప్పారు.
Read Also: Samantha Ruth Prabhu: ఇకపై మరింత ఎక్కువగా కష్టపడుతా!
అలాగే, హైదరాబాద్ మీద చంద్రబాబు అశాలు పెట్టూకోకుండా.. ఏపీ రాజధానిపై ఫోకస్ పెట్టాలని సీపీఐ నారాయణ చెప్పారు. పంతాలు పట్టింపులకు పోకుండా అభివృద్ధి పై ఫోకస్ పెట్టాలి.. సంక్షేమ పథకాల ద్వారా.. అధికారం వస్తుంది అనుకోవడం తప్పు.. అభివృద్ధి ద్వారా వస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోయాడు.. గత ఐదేళ్లు సంక్షేమ పాలన చేస్తే ఓట్లు ఎందుకు కొనుక్కునాడు.. నిరంకుశ పాలన కారణంగానే గత ప్రభుత్వం అధికారం కోల్పోయిందన్నారు. చదువుకున్న వాడు అనుకున్నాము.. కానీ తప్పులు చేశాడు అని నారాయణ వెల్లడించారు.