కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించినందుకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.…
సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు రానున్నారు. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు గులాబీ బాస్ ఓటేయనున్నారు. కేసీఆర్ చింతమడక గ్రామానికి సమీపంలో హెలిప్యాడ్‌లో దిగి.. అక్కడి నుంచి కారులో వచ్చి ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ దంపతులు ఓటు…
PM Modi: ఈ రోజు నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 96 ఎంపీ స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా నాలుగోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అరగంట ముందే పోలింగ్ కేంద్రానికి భారీగా జనాలు వచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణలో ఓటు…
Polling Started for MP Elections in 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని…
దేశమంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. గెలుపు ఎవరిదనే దానిపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. చర్చలే కాదు.. వేల కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రితో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళనున్న సిబ్బంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 29.79 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కరీంనగర్ లోకసభ స్థానం పరిధిలో 17 లక్షల 97 వేల150 మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణలో ప్రచార పర్వం ముగిసింది. ఇక 13న జరిగే పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కూడా జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను 13 నియోజక వర్గాల్లో మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు…
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్దంమైందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక, ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నట్లు చెప్పారు.