Maoists Press Note: చర్చల కోసం నక్సలైట్లు ఇచ్చిన ప్రకటనపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని మావోయిస్టులు ఆరోపించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై మావోయిస్టుల లేఖ విడుదల చేసింది.
తేరుకుంటున్న పల్నాడు: రాజకీయ ఘర్షణలతో గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం రాత్రి నుంచే మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి.. పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతిభద్రతలు ఒకింత అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని…
TET Hall Tickets: టీఎస్ టెట్ అభ్యర్థులు నేటి (బుధవారం) నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్ 2వరకు టెట్ నిర్వహించనున్నారు.
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి 76.78 శాతం, అత్యల్పంగా.. హైదరాబాద్ 48.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో రాష్ట్రంలో 62.77 శాతం ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% ఓటింగ్ నమోదైంది.