ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు.. తొలి సారి తమ ఓటు హక్కును వేయబోతున్నారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, తెలంగాణలోని యువ ఓటర్లు సైతం ఎవరికి మద్దతు ఇస్తారనే కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
Right to Vote: ఐదేళ్లపాటు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించే సమయం ఆసన్నమైంది. మే 13 సోమవారం పోలింగ్ జరగనుంది.
పదేళ్ల నిజం కేసీఆర్ పాలన, పదేళ్ల విషం బీజెపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం వీటి మధ్యనే పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.."నరేంద్రమోడీ వస్తె కాలేజులు కట్టిన, రోడ్లు వేసిన అని చెప్పాలే.
CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో సందేశం ఇచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు వ్యాపారులను బెదిరించి రూ. కోట్లు వసూలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్, మరో నేత అశోక్ లు కలిసి చందాల దందా చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు.
మోడీ మారోసారి ప్రధాని అవుతారని.. అందుకు పూర్తిగా కృషి చేస్తానని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.