Ntvతో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరి బోర్డు మెంబర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే కీలక సమావేశం జరుగుతుంది.. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరగనుంది.. ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంలో ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ఎన్నుకోవడం లాంఛనమే.. ఎన్నికలకు ముందే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించింది.. ప్రభుత్వ సానుకూల ఓట్లే బీజేపీని మళ్ళీ గెలిపించాయన్నారు. మూడో సారి మోడీ ప్రధానిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారు.. ఎన్డీయే కూటమిలో అన్ని పార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Chandrababu: ఎన్డీఏకు మద్దతు.. తేల్చేసిన చంద్రబాబు
కాగా, ఎన్డీఏ కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి సొంతంగా 241 సీట్లు వచ్చాయి.. 16 సీట్లతో టీడీపీ రెండో స్థానంలో ఉంది.. 14 సీట్లతో జేడీయూ మూడో స్థానంలో నిలిచింది. చంద్రబాబు, నితీష్ కుమార్.. ఇప్పుడు ఎన్డీఏలో కింగ్ మేకర్లు.. ఎన్డీఏ కూటమిలో వారి పాత్ర కీలకంగా మారింది. దాంతో ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలోనే ఎన్డీఏ కన్వీనర్‌ని ఎన్నుకునే అవకాశం ఉంది. మరో వైపు ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏపీలో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టడంతో మరోసారి ముఖ్యమంత్రి కానున్నారు చంద్రబాబు.. ఆయన ప్రమాణస్వీకారానికి ఢిల్లీ పెద్దలను కూడా ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తోంది.