రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం…
ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్న మాధవరావు పాలిట కాలయముడయ్యాడు తమ్ముడు సాంబశివరావు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి గ్రామంలో మాధవరావుని గడ్డపారతో కొట్టి చంపాడు తమ్ముడు సాంబశివరావు.. అన్నదమ్ములిద్దరు ఘర్షన పడ్డారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన తమ్ముడు అన్నను గడ్డపారతో కొట్టి చంపాడు. అయితే వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఆస్తి తగాదాలే అని స్థానికులు చెబుతున్నారు. Also Read:Dussehra Celebrations : ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు, భక్తుల సందడి, భారీ బందోబస్త్…
Heavy Rains: వందంటే వర్షం.. కురుస్తోంది.. కుండతో పోసినట్టు.. ఆకాశానికే చిల్లు పడిందా.. మేఘాలు పగిలి ఒకేసారి పడిపోయాయా అనే విధంగా వర్షాలు పడుతున్నా్యి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అత్యధికంగా యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 13 సెంటీమీటర్ల వాన కురిసింది. జనగామ జిల్లా దేవరుప్పలలో 12 సెం.మీ వర్షపాతం రికార్డయింది. మెదక్ జిల్లా అల్లాదుర్గ్లో 10 సెం.మీ వాన కొట్టింది. మేడ్చల్ జిల్లా కీసరలో 10 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా…