* నేడు మధ్యాహ్నం 12.3కి జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమావేశం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం భేటీ.. మార్కాపురం మదనపల్లి జిల్లాల ప్రతిపాదనలపై చర్చ.. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై చర్చ..
* నేడు ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో డిప్యటీ సీఎం పవన్ పర్యటన.. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం..
* నేడు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. మూడు రోజుల పాటు పర్యటించనున్న జగన్.. జిల్లా నేతలతో సమావేశం కానున్న జగన్.. అరటి పంటను జగన్ పరిశీలించే అవకాశం..
* నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా రైతన్న మీ కోసం కార్యక్రమం.. 7 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్న వ్యవసాయశాఖ.. రైతుల సమాచారం సేకరణతో పాటు పలు సూచనలు చేయనున్న అధికారులు..
* నేడు కర్నూలులో విజయ పాల డెయిరీ సొసైటీ ఎన్నికలు.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూమా, ఎస్వీ కుటుంబాలు..
* నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సీజేఐ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొననున్న సీఎం రేవంత్..
నేడు తెలంగాణ భవన్ లో రెండు కీలక సమావేశాలు.. ఉదయం 10 గంటలకి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ.. ఎల్లుండి జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో వ్యవహరించాల్సిన తీరుపై కేటీఆర్ దిశానిర్దేశం.. మధ్యాహ్నం ఒంటి గంటకు బీసీ నేతలతో సమావేశం కానున్న కేటీఆర్.. రాబోయే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ పై బీసీ నేతలతో చర్చించనున్న కేటీఆర్..
* నేడు అచ్చంపేటలో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పర్యటన.. జన్ జాతీయ గౌరవ్ దివస్ లో భాగంగతా రాంచందర్ రావు పర్యటన..
* నేడు హైదరాబాద్ లో బీసీ సంఘాల సమావేశం.. ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన జరగనున్న మీటింగ్.. అన్ని పార్టీల నేతలను ఆహ్వానించిన బీసీ సంఘాలు.. పంచాయతీల్లో రిజర్వేషన్ల జీవో 46పై చర్చ..
* నేటితో ఐబొమ్మ రవికి ముగియనున్న పోలీస్ కస్టడీ.. విచారణకు రవి సహకరించడం లేదంటున్న పోలీసులు.. మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం..
* నేడు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం.. హైకోర్టు విచారణ తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..
* నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం.. 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్.. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న తొలి హర్యానా వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్..
* నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, గవర్నర్లు, సీఎంలు..
* నేడు అండమాన్ సముద్రంలో వాయుగుండం.. మలక్కా జలసంధి ప్రాంతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తుఫానుగా బలపడుతుందని ఐఎండీ అంచనా..