* నేడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్..
* నేడు నిజామాబాద్ లో మహేశ్ గౌడ్ పర్యటన.. ఉదయం 11 గంటలకు మున్నూరు కాపు సంఘం ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలతో మహేష్ గౌడ్ సమావేశం..
* నేడు హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు.. సీతాఫల్ మండి నుంచి చిలకలగూడ వరకు యూనిటీ మార్చ్.. పాల్గొననున్న కిషన్ రెడ్డి, రాంచందర్ రావు..
* నేడు పుట్టపర్తిలో ఏపీ సీఎం చంద్రబాబు.. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం ఒంటిగంటకు ఉండవల్లికి సీఎం తిరుగుపయనం..
* నేడు అనంతపురం జిల్లా రాప్తాడుకు వైఎస్ జగన్.. ఉదయం 10 గంటలకు బెంగుళూరులోని నివాసం నుంచి బయల్దేరనున్న జగన్.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు, రాజేశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరుకానున్న జగన్.. మధ్యాహ్నం 12: 30 గంటలకు బెంగళూరుకు వైఎస్ జగన్ తిరుగుపయనం..
* నేడు పుట్టపర్తిలో సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు.. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని అలంకరించిన సాయి భక్తులు..
* నేడు ఎన్ కౌంటర్లను నిరసిస్తూ భారత్ బంద్ కు మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు.. రంపచోడవరం, మారేడుమిల్లి సహా ఏజెన్సీ ప్రాంతాల్లో హైఅలెర్ట్.. ఏజెన్సీ మీదుగా భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు.. అల్లూరి జిల్లాలోని రంపచోడవరం బస్సు సర్వీసులు నిలిపివేత..
* నేడు విజయవాడలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ.. పాల్గొననున్న డీజీపీ హారీష్ కుమార్ గుప్తా..
* నేడు ఉట్నూర్ లో ఆదివాసి ధర్మ యుద్ధం 2 సభ.. భారీ బహిరంగ ఏర్పాట్లు చేస్తున్న ఆదివాసీలు.. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్ తో సభ.. ఎంపిడిఓ కార్యాలయ గ్రౌండ్ లో సభావేదిక.. తరలి రానున్న 9 తెగల ఆదివాసిలు.. ఉదయం నుంచే పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు..
* నేడు కాంచీపురం జిల్లాలో టీవీకే చీఫ్ విజయ్ పర్యటన.. కాంచీపురం జిల్లా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం.. కరూర్ ఘటన నేపథ్యంలో 2 వేల మందికే అనుమతి.. క్యూఆర్ కోడ్ ఉన్న వారికి మాత్రమే ప్రవేశం..
* నేడు రెండో రోజు దక్షిణాఫ్రికాలో జీ20 శిఖరాగ్ర సదస్సు.. జీ20 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోడీ హాజరు..