బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రెస్ ఉండదు.. రెండేళ్లు మనకు కష్టాలు తప్పవు అని సెటైర్లు వేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకోవడం లేదు.. పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఐదు నిమిషాలకే మాట మార్చారు అని పేర్కొన్నారు.
గుడ్న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. 600 ప్రత్యేక రైళ్లు సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని…
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కొత్త కార్యక్రమం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్,…
ఉద్యోగులు, జర్నలిస్టులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈజేహెచ్ఎస్ (ఎంప్లాయీస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్) వెల్నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వెల్నెస్ సెంటర్లలో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై మంత్రి శుక్రవారం అధికారులతో హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష చేశారు. ఈజేహెచ్ఎస్ పరిధిలోని జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12…
నల్లగొండ జిల్లాలో డిజిటల్ అరెస్ట్ కలకలం రేపింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ రిటైర్డ్ టీచర్ ను సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు గురిచేశారు. బెంగుళూరులో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినావని అరెస్ట్ చేస్తున్నామని ఫోన్ చేశారు సైబర్ నిందితులు. అరెస్ట్ కావద్దు అంటే రూ.18 లక్షలు తమ ఎకౌంట్ లో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధిత రిటైర్డ్ టీచర్ రూ.18 లక్షలు సైబర్ నేరగాళ్ల ఎకౌంట్ లో డిపాజిట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. డబ్బు బదిలీ చేసేందుకు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం రేపిన ఆత్మహత్య కేసులో లోతైన దర్యాప్తులో నిజాలు బయటపెట్టారు పోలీసులు. ప్రియుడు, స్నేహితులతో కలిసి భార్య హత్యకు కుట్రపన్నిందని వెల్లడించారు. భర్తను గొంతు నులిమి హతమార్చినట్లు తెలిపారు. వెంగళరావు కాలనీలో ధరవత్ హరినాథ్ (39) హత్య కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తపై దాడి చేసి గొంతు నులిమి హతమార్చారు నిందితులు. తర్వాత ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. భార్య దరావత్ శ్రుతిలయ ప్రధాన…
ఈజీగా డబ్బు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు నకిలీ నోట్ల ప్రింటింగ్ కు పాల్పడుతున్నారు. దొంగనోట్లను ముద్రించి గుట్టుచప్పుడు కాకుండా చలామణిలోకి తీసుకొస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ లో దొంగ నోట్లు కలకలం రేపాయి. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్ల చలామణి అయినట్లు అధికారులు గుర్తించారు. కెనరా బ్యాంక్ లో క్రాప్ లోన్ కట్టడానికి వెళ్లిన జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న సాయిలు వద్ద రూ.2 లక్షల 8వేల…