మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మార్పు అని చెప్పి ఊదరగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందన్నారు. ఈ రెండేళ్లలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అప్పుడు కాలేశ్వరం బ్యారేజ్ ని పేల్చారు.. ఇప్పుడు చెక్ డ్యాం లను పేలుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు దొంగతనంగా ఇసుక తరలించేందుకు కష్టమవుతుంది అని చెక్ డ్యాం లు పేలుస్తున్నారు. నిన్న మొన్న పెద్ద…
Story Board: ప్రభాకర్ రావు విదేశాల నుంచి వచ్చాక.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెరిగింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు.. కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు మాజీ సీఎం కేసీఆర్కు లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాల అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా తానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించా అని చెప్పారు. ఇక కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్పై సీఎం రేవంత్ మాట్లాడిని భాష సరికాదన్నారు. ఈరోజు మీడియా చిట్చాట్లో బండి సంజయ్…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఇవాళ్టితో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బృందం విచారిస్తోంది. డిసెంబర్ 26వ తేదీన ప్రభాకర్ రావును విడిచి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండో వారం విచారణలో ప్రభాకర్ రావు నుంచి సిట్ బృందం కీలక సమాచారం రాబట్టింది. మొదట విచారణకు సహకరించని ప్రభాకర్ రావు.. పూర్తి ఆధారాలు ముందు ఉంచడంతో…
చట్టపరంగా న్యూ ఇయర్ను ఎంజాయ్ చేయండి.. హద్దు మీరితే సెంట్రల్ జైలే గతి.. సీపీ మాస్ వార్నింగ్.. న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.. 2025కి బైబై చెప్పేసి.. 2026కి గ్రాండ్గా వెల్కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.. అయితే, చట్టపరంగా న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయండి, హద్దు మీరితే విశాఖ సెంట్రల్ జైలే గతి అని మాస్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. న్యూ ఇయర్ ముసుగులో మత్తు సరఫరా…
నిజామాబాద్ జిల్లాలో దారుణం. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుపై అత్యాచార యత్నం తీవ్ర కలకలం రేపింది. ఖలీల్ వాడి లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న నర్సు పై ఆసుపత్రి నిర్వాహకుని స్నేహితుడు లైంగిక దాడికి యత్నించాడు. బాధిత నర్సు నిందితుడి నుంచి తప్పించుకుని డయల్ 100కు కాల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాగా అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు…
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, సంక్షేమ పథకాలు మరియు ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ఈ సర్వే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ యాప్…