Jagga Reddy : మాట నిలబెట్టుకున్న జగ్గారెడ్డి
- సంగారెడ్డి, సదాశివపేటలో కాంగ్రెస్ మెజారిటీ
- చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ప్రకటన
- 38లో 22, 26లో 16 స్థానాలు కైవసం
- జిల్లాలో హంగ్ మున్సిపాలిటీలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి , సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం, జగ్గారెడ్డి తాను అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం చైర్మన్ , వైస్ చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.
Amazon & Flipkart లో రచ్చ.! Moto G57 Power పై భారీ డిస్కౌంట్.!
Also Read
జగ్గారెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్‌గా షేక్ షఫీ ఎంపికయ్యారు. సదాశివపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్‌గా రేణుక చిరును ఫైనల్ చేశారు. వీరంతా ఈ నెల 16వ తేదీన (ఎల్లుండి) అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 22 వార్డులను కైవసం చేసుకుంది. అలాగే సదాశివపేటలోని 26 వార్డులలో 16 స్థానాలను గెలుచుకొని తిరుగులేని పట్టు సాధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గారెడ్డి ప్రతి వార్డుకు 8 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తెస్తానని, అలాగే ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని ఇచ్చిన హామీలు ఓటర్లను ఎంతగానో ఆకర్షించాయి.
సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో సంగారెడ్డి, సదాశివపేటతో పాటు నారాయణఖేడ్, ఆందోల్-జోగిపేటలను కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే, కొన్ని మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటంతో అక్కడ క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి. స్వతంత్రులు , ఇతర పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏదేమైనా, తన సొంత నియోజకవర్గ పరిధిలో జగ్గారెడ్డి ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి రాజకీయాల్లో తన మార్కును మరోసారి చాటుకున్నారు.
Ryzen 5 + 16GB RAM + SSD.. ఇప్పుడు 46,699 కే.! డీల్ మిస్ అవ్వకండి.!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!