ఆ నియోజకవర్గంలో కచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుందని బీఆర్ఎస్ నమ్ముతోందా? అందుకే ఘర్ వాపసీ అంటూ పాత నేతను తిరిగి ఆహ్వానిస్తోందా? ఇప్పుడున్న ఇన్ఛార్జ్కంటే ఆ నాయకుడే సూపర్ అని పార్టీ పెద్దలు ఫీలవుతున్నారా? డాక్టర్ రాసింది, రోగి కోరుకున్నది ఒకటే మందు అన్నట్టు సదరు నేత కూడా సై అంటూ చేరికకు సిద్ధమైపోయారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా ఘర్ వాపసీ లీడర్? మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.…
నియోజకవర్గాలు అప్పగించారు. బాధ్యతలు పంచేశారు. పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా…. ఇక పూర్తి భారం మీదేనని క్లారీటీ ఇచ్చేశారు. ఇదే కొందరు తెలంగాణ మంత్రుల్ని టెన్షన్ పెడుతోందట. ఈ పరీక్ష ఎలా నెగ్గాలంటూ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇంతకీ ఏంటా పరీక్ష? ఇన్ఛార్జ్ మినిస్టర్స్కు కంగారు ఎందుకు? మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ అధికార పక్షానికి సవాల్గా మారుతున్నాయి. పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ని గెలుచుకోవాలని ఇప్పటికే నేతలకు దిశా నిర్దేశం చేసింది కాంగ్రెస్ హై కమాండ్.…
టీడీపీలో కార్యకర్తలే అధినేత… పార్టీనే అందరికీ అధినాయకత్వం.. టీడీపీ అనేది ఒక వ్యక్తికి పరిమితం కాని పార్టీ అని, కార్యకర్తలే నిజమైన అధినేతలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీలకు నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, పార్టీనే అందరికీ అధినాయకత్వం అని పేర్కొన్నారు. పార్టీలో యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గ్రామ…
మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం.. 12 ఏళ్ల తర్వాత యూపీలో దొరికిన నిందితుడు.. ఫోక్సో కేసులో 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిని విశాఖ టూ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.. 2014 లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, కిడ్నాప్ కేసులో మహమ్మద్ సల్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.. అల్లిపురానికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో రిమాండ్ కు తరలించారు.. కొద్ది రోజుల తర్వాత కండీషన్ బెయిల్…
పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ అధిష్టానం ఫోకస్.. జనసేన-బీజేపీతో జతకట్టి ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది తెలుగుదేశం పార్టీ.. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం.. మరోవైపు.. కూటమిలోని పార్టీలు.. ఆయా పార్టీల నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టాయి.. మరోవైపు.. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇటీవల జిల్లా కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేసిన అధిష్టానం, ప్రస్తుతం రాష్ట్ర కమిటీ ఎంపికపై…
Journalist Accreditation Rules: తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేపట్టింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా “తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ – 2025″కు పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం G.O. Rt.No.103ను విడుదల చేసింది. జనవరి 24, 2026న స్పెషల్ సెక్రటరీ సిహెచ్. ప్రియాంక జారీ చేసిన ఈ ఉత్తర్వుల ద్వారా జర్నలిజం రంగంలో మహిళలకు ప్రాధాన్యత పెరగడంతో పాటు, క్షేత్రస్థాయి జర్నలిస్టులకు లబ్ధి చేకూరనుంది. OnePlus 15R…
సింగరేణి, నైని బొగ్గు బ్లాక్ విషయంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ కు ఆత్మ సింగరేణి అని అన్నారు. అలాంటి సింగరేణిపై కట్టుకథలు.. కొన్ని లేఖలు.. కొన్ని రివ్యూ లు వచ్చాయని మండిపడ్డారు. 42 వేల మంది సింగరేణి ఉద్యోగుల.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 20 వేల మంది నీ మోరల్ గా దెబ్బతీసేలా చేశారని ఫైర్ అయ్యారు. ప్రధానంగా పెట్టుబడులు రాకుండా..…
ఇంటర్వ్యూ కి పిలిచి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఫతేనగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫతేనగర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి ఓ యువతి ఈనెల 21న వెళ్లింది. ఆమెకు నెలకు రూ.22 వేల జీతం ఇస్తానని, ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలని, విజిటర్లతో మాట్లాడాలని స్కూల్ కరెస్పాండెంట్ చెప్పాడు. తన పీఏగా కూడా ఉండాలని…
యూసఫ్ గూడా డంపింగ్ యార్డ్ లో విషాదం చోటుచేసుకుంది. చెత్త తొలగిస్తుండగా చెత్త తొలగింపు మిషన్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. ఉదయం చెత్త తొలగించే మిషన్ లోపలికి లాగటంతో మిషన్ లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు కన్నుమూశారు. రామ్ కి యాజమాన్యం నిర్లక్ష్యం చెత్త సేకరణ కార్మికుడు దుర్మరణం చెందాడని కార్మికులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుడు కర్నూలు జిల్లా, దుగ్గలి మండలం, పగిడిరాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై…