తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కబ్జాదారుల నుంచి వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకుని రక్షిస్తోంది. ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు, బఫర్ జోన్ లోని స్థలాలను కబ్జాదారుల చెరనుంచి కాపాడుతోంది. ఈ క్రమంలో పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసుల సమక్షంలో అక్రమ ప్రహారీలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ భూమి అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు…
విజయవాడలో దారుణం.. రూ.10 కోసం వృద్ధుడి హత్య..! విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మందు తాగేందుకు కేవలం రూ.10 ఇవ్వలేదన్న కారణంతో ఓ వృద్ధుడిని మైనర్ బాలుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. మైనర్ బాలుడు ప్రసాద్ మద్యం మత్తులో మందు కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో…
ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. నేడు అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, ఆర్థిక సహకారం అంశాలపై ఈ భేటీల్లో విస్తృతంగా చర్చ జరగనుంది. ప్రధానంగా “పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్”కు అవసరమైన కేంద్ర అనుమతులు, అలాగే రాష్ట్రంలోని జాతీయ రహదారులతో ఏపీ రాజధాని అమరావతికి రహదారి అనుసంధానం అంశాలపై కేంద్ర…
* నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదో టీ-20.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ * హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును ప్రారంభించనున్న రాష్ట్రపతి * సుప్రీంకోర్టులో ఇవాళ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారన్న కేసు విచారణ.. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తీర్పు ఇచ్చిన స్పీకర్ * ఢిల్లీ పర్యటనలో సీఎం…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ అయ్యారు. RBI బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా RBI గవర్నర్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు వివరించారు సీఎం రేవంత్. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటుపై…
ఆ ఎంపీలు పొలిటికల్‌గా ఎందుకు యాక్టివ్ మోడ్‌లో కనిపించడం లేదు? లేనిపోని విషయాల్లో వేలుపెట్టి నెత్తి మీదికి తెచ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? లేక ఇతర కారణాలున్నాయా? టిక్కెట్స్ ఇచ్చి గెలిపించిన పార్టీ నాయకత్వంపై ప్రత్యర్థులు దాడి చేస్తున్నా మౌనంగా ఎందుకు ఉంటున్నారు..? ఎవరు వాళ్ళు? ఏంటా మ్యూట్ మేటర్? లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 సీట్లు గెల్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎన్నికల టైంలో, గెలిచిన కొత్తల్లో తప్ప… తర్వాత ఎప్పుడూ గాంధీభవన్ ముఖం చూసిన…
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం కోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ జరపనున్నారు. నిన్న 5 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ స్పష్టం…
పార్టీ మారలేదని స్పీకర్‌కు చెప్పి ఆ ఎమ్మెల్యే ప్రత్యర్థులకు పొలిటికల్ టార్గెట్ అయ్యారా? నైతికతను ప్రశ్నిస్తూ నియోజకవర్గంలో చెడుగుడు ఆడేసుకుంటున్నారా? తవ్వకాలు జరిపి మరీ… పాత బైట్స్ వెలికి తీసి సోషల్ మీడియాలో సర్క్యులేషన్స్తో రచ్చ చేస్తున్నారా? ఏ ఎమ్మెల్యే విషయంలో ఆ స్థాయి హంగామా జరుగుతోంది? అక్కడే ఎందుకలా? సార్…. నేను పార్టీ మారలేదు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించానన్న మాట అబద్ధం. కావాలంటే చూడండి… నా జీతం నుంచి ఇప్పటికీ నెలనెలా ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12702 గ్రామ…
సోషల్ మీడియా ఎఫెక్ట్, సినిమాల ప్రభావం ఏమోగాని ఇటీవల లవ్ స్టోరీలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో అట్రాక్షన్ కు లోనై అదే లవ్ అనుకుని కొందరు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నారు. అయితే ప్రేమ వివాహం తర్వాత భర్త వేధింపులు లేక అత్తమామల వేధింపులతో యువతులు బలైపోతున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కొందరు, కట్నం డిమాండ్ చేస్తూ మరికొందరు ప్రియురాలి మృతికి కారణమవుతున్నారు. ఇదే రీతిలో…