2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వీఆర్ఓ హారతి స్థానిక పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణ వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రవాణా శాఖ కు సంబంధించిన లారీలు ఇతర వాహనాలు ఇబ్బంది లేకుండా స్థానిక జిల్లా రవాణా అధికారులు & కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
Patnam Narender Reddy: వికారాబాద్ జిల్లాలో టెన్షన్ వాతవరణం కొనసాగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ లోని అడిషనల్ ఎస్పీ కార్యాలయం డీటీసీ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
BRS KTR: ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి 11 నెలలవుతోంది. ఈ టైంలో రాష్ట్రం కోసం చాలా చేసినా... దాన్ని జనానికి సరిగా చెప్పుకోలేకపోతున్నామన్న అసంతృప్తి, అసహనం పెరుగుతున్నాయట ప్రభుత్వ పెద్దల్లో. దీంతో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం ఉందా..? ప్రతిపక్ష పార్టీలు ముప్పేట దాడి చేస్తున్నా.. అధికార పక్ష నాయకులు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు?