హైదరాబాద్ వేదికగా భక్తి టీవీ కోటి దీపోత్సవం అంగరంగవైభవంగా సాగుతోంది.. ఇప్పటికే మూడు రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా సాగగా.. నాల్గో రోజు విశేష కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.. కార్తిక మాసంలో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. ఇక, ఈ రోజు అలంపురం జోగులాంబ కల్యాణం కన్నులపండుగగా సాగనుంది..
ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని పథకం ప్రకారం బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కొడంగల్‌లో భూసేకరణ పై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారు.. బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారని అన్నారు. దాడికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి.. ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మల్లు రవి మండిపడ్డారు.
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు అభివృద్ధి వైపు దృష్టి పెడుతుండగా... అనుచరగణం మాత్రం చెలరేగుతోందని, కొంతమంది వ్యవహార శైలి వల్ల జనంలో నెగెటివ్ రిమార్క్స్ పడుతున్నాయని అంటున్నారు. ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్... తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓనేతను దూరం పెట్టినట్టు సమాచారం
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసులు కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌ను నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో స్మిత సబర్వాల్ కొనసాగనున్నారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని మంత్రి ఆరోపించారు.