Hydra Commissioner: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత అక్రమంగా నిర్మించిన ఇండ్ల పై చర్యలు తప్పవనీ స్పష్టం చేశారు. కూకట్ పల్లి లోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన నిర్మాణాలను కూల్చబోమని రంగనాథ్ తెలిపారు. కూల్చివేతలపై హైడ్రాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు.
హైడ్రా ఏర్పాటుకు ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లదని, జూలై తర్వాత నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను ఖచ్చితంగా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల తీసుకున్న హైడ్రా అనుమతులను పరిశీలిస్తామని తెలిపారు. వాటిలో లోపాలుంటే ఆ నిర్మాణాలను అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తుందన్నారు. పేదల జోలికి హైడ్రా రాదని, పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుందని తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని రంగనాథ్ సూచించారు.
OnePlus Mobiles Release: ఒకేరోజు రెండు మొబైల్స్‌ను విడుదల చేయబోతున్న వన్‌ప్లస్