తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
DK Aruna : బీజేపీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నీటిని శుద్ధి చేసి మంచి నీటిగా మార్చాలని తమకు వ్యతిరేకం లేదు అని ఆమె స్పష్టం చేశారు. అయితే, మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రణాళికను మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆమె…
రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యూమరేటర్లతో ఈ సర్వే కొనసాగుతోందని, సర్వే ప్రక్రియ వల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత పడదని మంత్రి పొన్నం ప్రభాకార్ స్పష్టం చేశారు.
Yadagirigutta: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం భారీగా క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
Jagtial Road Accident: మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో వధూవరులు ఏకమయ్యారు. ఆ తర్వాత రిసెప్షన్ జరగాల్సి వుంది. ఈ వేడుకకోసం వధువు కుటుంబం బయలు దేరింది ఇంతలోనే విధి చిన్న చూపుచూసింది.