Group-2 Exams: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు (ఆదివారం) ప్రశాంతంగా జరిగాయి. మొదటి, రెండో పేపర్‌లను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లుగా నిర్వహించగా, సోమవారం మూడు, నాలుగు పేపర్లు నిర్వహిస్తున్నారు. TGPSC జారీ చేసిన గ్రూప్ నోటిఫికేషన్‌లలో ఇది చివరిది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-3 పరీక్షలు పూర్తి కాగా, గ్రూప్-4 ఉద్యోగాలు కూడా భర్తీ అయ్యాయి.
Read also: Astrology: డిసెంబర్ 16, సోమవారం దినఫలాలు
అధికారులు తొలిరోజు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. మొదటి పేపర్‌ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో పేపర్‌ను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. రాత్రి 9.30 గంటల తర్వాత గేట్లను మూసివేశారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు. ఈరోజు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9.30 గంటలలోపు రావాలని, లేకుంటే ఆ తర్వాత అనుమతి ఇవ్వబోమని అధికారులు తెలిపారు.
Read also: Bigg Boss 8 Telugu: పక్కాగా పోలీస్ ప్లానింగ్.. ఆల్ హ్యాపీస్!
గ్రూప్-2 పరీక్షకు తొలిరోజు సగానికిపైగా అభ్యర్థులు హాజరుకాలేదు. మొత్తం 783 ఉద్యోగాలకు 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 74.96 శాతం మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. పేపర్-1 పరీక్షకు 2,57,981 (46.75%) మంది, పేపర్-2 పరీక్షకు 2,55,490 (46.30%) మంది మాత్రమే హాజరయ్యారు. అయితే పరీక్షలు పూర్తయి సమాధాన పత్రాలన్నీ వచ్చిన తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని టీజీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.
కఠినంగా మొదటి పేపర్- అభ్యర్థులు
ఆదివారం నిర్వహించిన గ్రూప్-2, జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ మొదటి పేపర్ కఠినంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. అభ్యర్థుల సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను లోతుగా పరిశీలించేలా ప్రశ్నపత్రాన్ని రూపొందించినట్లు మెజారిటీ అభ్యర్థులు తెలిపారు. ఇస్రో, జాతీయ అవార్డులు, ఖేలో ఇండియా, కాగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, నీతి ఆయోగ్, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, భూగోళశాస్త్రం, ఐఐటీలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకోవడానికి చాలా సమయం పట్టిందని వారు వెల్లడించారు. దీంతో చాలా మంది అభ్యర్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సమయం సరిపోవడం లేదన్నారు. పేపర్-2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీకి సంబంధించిన ప్రశ్నల్లో హిస్టరీ కఠినంగా ఉండగా, పాలిటీ కాస్త ఈజీగా ఉంది. చాలా మంది అభ్యర్థులు సొసైటీకి సంబంధించిన ప్రశ్నలు ఓ మోస్తరుగా ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా తెలంగాణ చరిత్రపై అడిగే ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రశ్నలకు కొంతమంది అభ్యర్థులు మాత్రమే సరైన సమాధానాలు చెప్పగలరని వారు తెలిపారు.
Harish Rao : అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడు