Online Betting Suicide: ఈ మధ్యకాలంలో ప్రజలు కష్టపడి పనిచేసే డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం, లేదా బెట్టింగ్ ద్వారా డబ్బులను సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో విజయం సాధిస్తే సరి.. లేకపోతే, చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే మనం మీడియా ద్వారా అనేక ఆన్లైన్ బెట్టింగ్ లకు సంబంధించిన అనేక మరణాలను చూసే ఉన్నాము. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే..
Also Read: BRS Protest: చేతికి బేడీలు, నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ వినూత్న నిరసన..
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం బండవుతాపురం గ్రామానికి చెందిన మరుపట్ల హనూక్(25) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చెరిపించారు. ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కోలుకోలేక మృతి చెందాడు. అప్పులపాలై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ విషయంలో పబ్జి గేమ్ ద్వారా పరిచయమైన వైజాక్ చెందిన ఓ యువకుడి మాటలు నమ్మి ఆన్లైన్ బెట్టింగ్ జూదంలోకి దిగాడు మరుపట్ల హనూక్. అందులో భాగంగానే ఓ యాప్ ద్వారా లక్షల్లో బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్నాడు హనుక్. స్థానిక పెట్రోల్ బంక్ లో పనిచేసే హనుక్ మూడు లక్షల వరకు బెట్టింగ్ లో పోగొట్టుకున్న యువకుడు. ఈ మరణంతో శోకసముద్రంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. వర్ధన్నపేట మండలంలో ఆన్లైన్ బెట్టింగ్ తో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు యువకులు బలి అయ్యారు.
Also Read: KP Vivekanand: మహిళా మంత్రితో కేటీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయించారు..