సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం ఉత్తరపల్లిలో యువకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిన్న దారుణ హత్యకు గురైన రాజు (35) హత్య కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. భర్తని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. విచారణలో ఏమీ తెలియనట్టు అమాయకత్వం ప్రదర్శించిన భార్య సుమలతను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం… సుమలత 12 ఏళ్ల క్రితం రాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుమలతపై ప్రేమతో రాజు తన…
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఓఆర్ఆర్పై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలు, హెవీ వెహికిల్స్‌ను అనుమతిస్తామని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయని, పట్టుపడిన వారిపై కఠిన చర్యలు తప్పని రాచకొండ సీపీ హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు…
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నేడు ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్ జోన్‌లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్‌లోని 4 ఎకరాల ఖాళీ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను హైడ్రా కూల్చివేసింది. ఆ స్థలంలో ఉన్న వైన్స్‌ను తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశించారు. కూల్చివేతల సందర్భంగా అధికారులకు భారీ బందోబస్తు చేపట్టారు. ఇటీవల భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భగీరథమ్మ చెరువు…
మద్యం ప్రియులకు శుభవార్త. నూతన సంవత్సరం వేడకల్లో భాగంగా మంగళవారం (డిసెంబర్ 31) వైన్స్ షాపుల సమయ వేళలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు బార్లు, రెస్టారెంట్లు కూడా ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలుసుకున్న మందు బాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.…
గత 25 రోజులుగా సర్వ శిక్షా ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల ప్రతినిధులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం, విద్యాశాఖ అధికారులు చర్చలు నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేవంత్ కోరినట్టు టీటీడీ దర్శనాల కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులకు ఆమోదం తెలుపుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.. సోమవారం నుంచి గురువారం వరకు రెండు బ్రేక్ దర్శనం కోసం, రెండు ప్రత్యేక దర్శనం కోసం సిఫార్సు లేఖలను అనుమతి ఇస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..