ఎన్టీఆర్‌కు భారతరత్నపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అలియాస్ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, ఆయన కుమారుడైన టీడీపీ ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణను ఈ మధ్యే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ వరించింది.. అయితే, ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.. నాకు పద్మభూషణ్ కాదు.. నాన్న (ఎన్టీఆర్)కు భారతరత్న రావాలని వ్యాఖ్యానించారు.. నాకు పద్మభూషణ్ అవార్డు కంటే.. నాన్నకు భారతరత్న అవార్డు రావాలని అనేది కోట్లాదిమంది తెలుగు ప్రజలు ఆకాంక్షగా పేర్కొన్నారు.. కచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.. ఆయనకు భారతరత్న అవార్డును.. తెలుగు ప్రజలు, తెలుగు జాతీయ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు తిరిగి ఎన్నిక..
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్).. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు వి. శ్రీనివాసరావు.. నెల్లూరులో 27వ ఏపీ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. ఇక, 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు.. 15 మందితో నూతన కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నారు.. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా వెంకటేశ్వరరావు, బాబురావు, ప్రభాకర్ రెడ్డి, రమాదేవి, తులసీదాస్, వెంకటేశ్వర్లు, లోకనాథం, సురేంద్ర, సుబ్బరావమ్మ, రాంభూపాల్, ఉమామహేశ్వరరావు, బలరాం, మూలం రమేష్, ఏవీ నాగేశ్వరరావులను ఎంపిక చేశారు.. వీరిలో ఏవీ నాగేశ్వరరావు (ఎన్టీఆర్ జిల్లా), బి. బలరాం (పశ్చిమ గోదావరి జిల్లా)ను కొత్తగా కార్యదర్శి వర్గంలోకి తీసుకున్నారు.. కార్యదర్శి, కార్యదర్శివర్గంతో కలిసి ఉన్న 50 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఏడుగురు ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించే పార్టీగా ఉన్న సీపీఎం.. తన ప్రజా సంఘాలతో మరింత ఉధృతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది..
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఇవాళ కూడా ఎన్నికల ప్రక్రియ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్.. తమ పార్టీ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి.. హైకోర్టులో పిటిషన్ వేశారు.. అయితే, ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది.. కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.. కార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్ కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.
ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ కీలక చర్చ..
ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీకి, ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ మధ్య కీలక భేటీ కొనసాగింది. ఈ మీటింగ్ లో ఉత్తమ్ కుమార్ తో పాటు కమిటీ వైస్ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదికను ఏక సభ్య కమిషన్ అందజేసింది. ఆగస్టు 1వ తేదీ, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు అధ్యయనం కోసం రాష్ట్ర సర్కార్ 2024 అక్టోబర్ 11న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమించింది. రెండు నెలల్లో అధ్యయనం చేసి తుది నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలని సూచించింది. దీంతో అధ్యయనం పూర్తి చేసిన కమిషన్ ఈరోజు సబ్ కమిటీకి రిపోర్టును అందజేసింది. ఇక, రేపు (ఫిబ్రవరి 3న) జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ నేతలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి..!
బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పైనా వేటు పడుతుందన్నారు. అలాగే, ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం అసాధ్యమన్నారు. అయితే, తెలంగాణ పార్టీ మారిన ఎమ్మెల్యే వ్యవహారంలో కేటీఆర్ వేసిన పిటిషన్ విచారణ సోమవారం నాటికి వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌లతో కలిపి విచారిస్తామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఇక, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాలయాపన చేస్తున్నారని సుప్రీంకోర్టులో కేటీఆర్ జనవరి 29న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే, ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై కూడా విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి ఈ నెల 10వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన వారిపై వేటు పడటం ఖాయమని, ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణకు కేటాయించిన రైల్వే ప్రాజెక్ట్‌లపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన రైల్వే ప్రాజెక్ట్‌లపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు రూ. 5,337 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించినట్లు తెలిపారు. యూపీఏ హయాంలో అత్యధికంగా రూ.886 కోట్ల కేటాయింపులే మాత్రమే జరిగాయని పేర్కొన్నారు. ఇక తెలంగాణ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని తెలిపారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 1,026 కి.మీ.మేరకు కవచ్ ఏర్పాటు చేస్తున్నామని… 2026లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ధనిక దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలో కూడా “కవచ్” ఏర్పాటుకు 21 ఏళ్లు పట్టిందన్నారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తైనట్లు చెప్పారు. పేద వర్గాల కోసం నమో భారత్ రైళ్లను నడుపుతున్నామని చెప్పారు. త్వరలో దేశమంతా దాదాపు 100 నమో భారత్ ఎక్స్‌ప్రెస్‌లు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ట్రంప్ ప్రమాణస్వీకారం, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఆరోపణలు..
సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీకి, అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ స్వీకారోత్సవానికి ఆహ్వానంపై ఆయన ఆరోపణలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. రాహుల్ వ్యాఖ్యల్ని అధికార పక్షం తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని బిజెపి ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ విదేశాంగ విధానానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రకటనలు చేయవద్దని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానం పొందడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని అమెరికాకు పంపాల్సి అసవరం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ, ఆర్థిక విధానాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. “మేము అమెరికాతో మాట్లాడినప్పుడు, మా ప్రధానమంత్రి ఆహ్వానం కోసం విదేశాంగ మంత్రిని మూడు-నాలుగు సార్లు పంపము ఎందుకంటే మాకు పొడక్షన్ సిస్టమ్ ఉండి, మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాలపై పని చేస్తుంటే, అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారు” అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
మారుతి, హోండా, హ్యుందాయ్‌లలో అత్యంత లగ్జరీ సెడాన్ ఏ కంపెనీది ?
SUV, హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లలో ఏ కారు లగ్జరీదో ఎవరిని అడిగినా సెడాన్ అనే చెబుతుంటారు. ప్రస్తుతం సెడాన్ విభాగంలో మారుతికి సియాజ్, హోండాకు సివిక్, హ్యుందాయ్‌కు వెర్నా సెడాన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు కార్లలో అత్యంత ప్రీమియం కారు ఏది అనే ప్రశ్న కారు ప్రియుల మెదళ్లను తొలిచేస్తుంది. మారుతి సియాజ్ ధర రూ. 9.40 లక్షల నుండి రూ. 12.45 లక్షల మధ్య ఉండగా, హ్యుందాయ్ వెర్నా ధర రూ. 11.07 లక్షల నుండి రూ. 17.55 లక్షల మధ్య ఉంది. హోండా సివిక్ ధర రూ. 18.04 నుండి రూ. 22.45 లక్షల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఈ మూడు కార్లలో అత్యంత ప్రీమియం కారు ఏది అనే ప్రశ్న తలెత్తుతుంది. దీని గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మారుతి సియాజ్ కారును విడుదల చేసినప్పుడు అది పెట్రోల్, డీజిల్ రెండింటిలోనూ అందుబాటులో ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మారుతి సియాజ్ డీజిల్ వేరియంట్ ప్రొడక్ట్ ఆపేసింది. మారుతి సియాజ్‌లో చాలా స్పేస్ ఉంటుంది. ఈ కారులో 300 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. సేఫ్టీ కోసం ఈ సెడాన్ కారులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ABS/EBD, హై స్పీడ్ అలర్ట్, సీట్‌బెల్ట్ అలర్ట్, హిల్ హోల్డ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ వంటి ఫీచర్లు అందించింది.
బీపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. 12 మంది ఆటగాళ్లపై అనుమానం..!
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫిక్సింగ్ కలకలం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కుదిపేసింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా.. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) చూస్తోంది. ప్రస్తుతం బీపీఎల్‌లో ఫిక్సింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న యాంటీ కరప్షన్ యూనిట్‌తో కలిసి పనిచేసే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని బీసీబీ తెలిపింది. కాగా.. ఈ లీగ్‌లో ప్రపంచంలోని పలువురు స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. ప్రస్తుత బీపీఎల్ సీజన్‌లో ఫిక్సింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బీసీబీ యొక్క యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) 8 మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకున్నట్లు వివిధ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. యాంటీ కరప్షన్ యూనిట్ 10 మంది ఆటగాళ్లను ప్రశ్నించింది. ఇందులో ఆరుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు అన్‌క్యాప్‌డ్ బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఫ్రాంచైజీలలో దర్బార్ రాజ్‌షాహి, ఢాకా క్యాపిటల్స్‌పై ఎక్కువగా అనుమానాలు ఉన్నాయి. సిల్హెట్ స్ట్రైకర్స్, చిట్టగాంగ్ కింగ్స్‌పై కూడా కమిటీకి సందేహాలు ఉన్నాయి.
లావణ్య-రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్?
లావణ్య రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని ఫిర్యాదు చేసింది లావణ్య. ఇక పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ గా గడిపిన వీడియోలుతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో లావణ్య కు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేసిన మస్తాన్ సాయి ఆమెను బెదిరించినట్టు తెలుస్తోంది. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను పోలీసులకు లావణ్య అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200 వీడియోలకు పైగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక మరోపక్క గతంలో డ్రగ్స్ లో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి అప్పట్లో కూడా వార్తల్లోకి ఎక్కాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
మస్తాన్ సాయి కేసులో సంచలనాలు.. హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. నేనేం మంచిదాన్ని కాదు కానీ కుట్ర చేశారు!
రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె రివీల్ చేసిన వివరాలు షాకింగ్ గా ఉన్నాయి. ఆమె రాసిన లేఖ యధాతంగా మీకోసం నేను రాజ్ తరుణ్ భార్యని, కోకాపేటలో నివసిస్తున్నాను. నాకు రాజ్ తరుణ్ కి గుంటూరు కి చెందిన రావి రామ్మోహనరావు కుమారుడు రావి బావాజీ మస్తాన్ సాయి, 2022 నుండి ఉన్నిత్ రెడ్డి (చింటూ) అనే ఫ్రెండ్ ద్వారా పరిచయం. నేను నవంబర్ 2024 లో మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి తన 4 TB హార్డ్ డిస్క్ ని తీసుకొని వొచ్చాను. ఇలా చేయడానికి గల ప్రధాన కారణం, ఆ హార్డ్ డిస్క్ లో మస్తాన్ సాయి మహిళలకు తెలియకుండా తీసిన, వందలకొద్దీ నగ్న వీడియోలు ఉన్నాయి. వారిలో కొంతమంది పెళ్లి అయిన, కొంతమంది పెళ్లికాని వారి నగ్న వీడియోలు, వందలకొద్దీ మహిళల ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి. అంతేకాకుండా మస్తాన్ సాయి Hack చేసి స్టోర్ చేసుకున్న ఎంతోమంది మహిళల జీవితాలు ఉన్నాయి. మస్తాన్ సాయి యువతుల ఫోన్లు హాక్ చేసి వారి గూగుల్ అకౌంట్స్, గూగుల్ ఫొటోస్ ఐ క్లౌడ్ అకౌంట్స్ తన ఆదీనంలో పెట్టుకొని, ఎవరు ఎదురు తిరగలేని పరిస్థితికి తీసుకొని వొస్తాడు. ఎదురు తిరగడం వల్ల కుటుంబ పరువుపోతుంది, మస్తాన్ సాయి జీవితాలు నాశనమ్ చేస్తాడు అనే భయం తో ఆ వీడియోలలో ఫోటోలలో ఉన్న ప్రతి ఆడపిల్ల మౌనంగా భరిస్తుంది. ఆ వీడియోలో ఉన్న ఏమహిళా ఎదురు తిరగలేదు. వాళ్ళకి శరీరంలో సెక్స్ కోరికలను పెంచే డ్రగ్స్ ఇస్తూ, తన కోరికలు తీర్చుకుంటూ వారికీ తెలిసి కొన్ని, మరియు వారికీ తెలియకుండా కొన్ని వీడియోలు రికార్డ్ చేసి ఈ హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసాడు. ప్రతి అమ్మాయి దగ్గర ఒక్కో డ్రామా, కొంతమందిని పెళ్లి చేసుకుంటాను అని, కొంతమందితో నేను తప్పు చేశాను ఉరి వేసుకొని చచ్చి పోతాను అని, ఆలా ఉరి వేసుకొని చచ్చి పోతున్నట్టు నమ్మించే వీడియోలు కూడా ఇదే హార్డ్ డిస్క్ లో ఉన్నాయ్. అంతేదుకు వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డి ఫోన్ హాక్ చేసి తీసిన వీడియోస్, ఫొటోస్, హీరో నిఖిల్ ఫోన్ లో ఉన్న ప్రైవేట్ పార్టీ వీడియోస్ కూడా ఈ హార్డ్ డిస్క్లోనే ఉన్నాయి. ఎంతోమంది మహిళల కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. వందల కొద్దీ వీడియోలు, వేలకొద్దీ ఫోటోలు. అతను ఎన్ని నేరాలు చేసాడో అన్ని కేసుల వివరాలు, ఆ నేరాలనుండి లీగల్ గా ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేసుకున్న పర్సెంటేషన్స్ కూడా ఉన్నాయి. లాయర్లతో ఎలా వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పిచుకోగలడో మాట్లాడే ఆడియోలు ఉన్నాయి. ఇంతకీ ఇతని దైర్యం ఏంటో తెలుసా ? కొడుకు ఇలాంటివాడు అని తెలిసినా, ఎన్ని కేసులు వున్నా వ్యవస్థల్ని డబ్బు పెట్టి మానేజ్ చేతున్న తన తండ్రి, రావి రామ్మోహనరావు.