Telangana Cabinet: బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణపై సర్కర్ ఫోకస్.. నేడు కేబినెట్, అసెంబ్లీలో చర్చ
- తెలంగాణలో తేలిన బీసీల లెక్క ..
- ఎస్సీ వర్గీకరణపైనా ముగిసిన కసరత్తు..
- సర్కారు దగ్గరున్న నివేదికలు..
- ఇవాళ కేబినెట్ ముందుకు రెండు రిపోర్టులు..
- కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీలో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు విషయంలో తెలంగాణ ప్రభుత్వం జెట్ స్పీడుతో ముందుకుపోతోంది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం లెక్క ఎంత అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. రాష్ట్రంలో 3 కోట్ల 54 లక్షల మంది ఇచ్చిన వివరాలు సర్కారు దగ్గరున్నాయి. మొత్తంగా కోటీ 12లక్షల 15వే కుటుంబాల వివరాలు నమోదు చేశారు. కులగణనలో 96 శాతానికి పైగా జనాభా పాల్గొంది. సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతమని లెక్క తేలింది. ముస్లిం మైనారిటీల్లో బీసీ జనాభా 10.08 శాతంగా ఉంది. ముస్లిం మైనారిటీల్లో బీసీలు కలిపి మొత్తం బీసీల జనాభా 56.33 శాతంగా తేలింది. రాష్ట్రంలో ఓసీ జనాభా 15.79 శాతం ఉంటే.. ముస్లిం మైనారిటీల్లో ఓసీ జనాభా 2.48 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీ జనాభా 12.56 శాతమని సర్వే లెక్క తేల్చింది. ఇక ఎస్సీ జనాభా 17.43 శాతం ఉండగా.. ఎస్టీ జనాభా 10.45 శాతం ఉంది.
Read Also: CM Chandrababu: ఇంఛార్జ్ మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు.. ఆ బాధ్యత మీదే..!
Also Read
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
- TGSPDCL : విద్యుత్ డిమాండ్లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కోసం కసరత్తు పూర్తయింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులతో పాటు, ఏకసభ్య జ్యూడిషియల్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అందాయి. బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికలను కేబినెట్ మీటింగ్‌లో ప్రవేశపెడతారు. ఇవాళ శాసనసభ ప్రత్యేక సమావేశంలో చర్చిస్తారు. ఉభయ సభల్లో ఈ రెండింటిపై డిస్కస్ చేస్తారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలంటూ ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణే అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటను కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈసారైనా మాజీ సీఎం కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ పిలుస్తోంది! గులాబీ బాస్ వస్తారా? రారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: Ratha Saptami in Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ప్రత్యేక, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బీసీలకు చాలా ఏండ్ల తర్వాత మేలు జరగబోతోందని సర్కారు చెబుతోంది. అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం హెచ్చరించారు. కులగణన కోసం ఇన్నాళ్లు ఉద్యమం చేసిన పోరాట యోధులకు అభినందనలు తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీ నేతలు సర్వేలో పాల్గొనలేదని పొన్నం విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్క కవిత తప్పించి ఎవరూ సర్వేకు వివరాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. సర్వేలో ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకురావొచ్చని, సరి చేస్తామని మంత్రులు క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!