తెలంగాణలో త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అంజిరెడ్డిని నియమించింది.
కేటీఆర్ విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి ఏదో ఒప్పందం ఉందనిపిస్తోందని ఆరోపించారు. లొట్టపీసు ముఖ్యమంత్రి అని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ప్రశ్నించారు.
Formula E Race Case : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హెచ్ఎండీఏ (HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి (BLN Reddy) ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. శుక్రవారం జరిగే విచారణలో, బీఎల్ఎన్ రెడ్డి నుండి హెచ్ఎండీఏ నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థకు బదిలీ చేసిన అంశంపై ఏసీబీ తన విచారణను కొనసాగించనుంది. ఈ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి పై ప్రశ్నలు సంధించడానికి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్…
తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ క్రమంలో.. నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈవో శివ శంకర్ లోతేటి చర్చలు జరిపారు. పేషెంట్లకు ఇబ్బంది కలిగించకుండా వైద్య సేవలు అందించాలని సీఈవో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ (United Breweries Limited) వివరణ ఇచ్చింది. 2019 నుంచి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ధరలు పెంచలేదని తెలిపింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూ బీర్లు సరఫరా చేశాం.. ధరలు సవరించాలని టీజీబీసీఎల్ను అనేక సార్లు కోరామన్నారు.
తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికలపై తీవ్రమైన దృష్టి పెట్టింది. పార్టీని బలోపేతం చేసేందుకు మండల అధ్యక్షులను ప్రకటించింది. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రాష్ర్ట పార్టీ అప్రూవల్ తీసుకొని బీజేపీ మండల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది.
"భూభారతి" చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో.. వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.