Hydra Commissioner: అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు ప్లాట్ల కొలతలు, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఆపై హైడ్రా కమిషనర్ ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీం కోర్టు న్యాయవాది ముఖీం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో ముచ్చటిస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో “తెలుగు వచ్చా?” అని ప్రశ్నించారు ముఖీం. అందుకు రంగనాథ్ స్పందిస్తూ..”మీరు చెప్పేది మీరు చెప్పండి.. ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు” అని ముఖీంను హెచ్చరించారు. ఇతర సభ్యులు దీనిపై కూడా చర్చ చేశారు. ఆ తర్వాత హైడ్రా కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై భాదితులు వాదనలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read: Hydra: శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ హోర్డింగులపై హైడ్రా కూల్చివేతలు
ఈ సంభాషణ గమనించనట్లైతే హైడ్రా అక్రమ నిర్మాణాలు చేప్పట్టిన వారిపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది.