Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల కింద 350 గ్రాముల అల్ఫాజోలం పట్టుకున్నాం.. పట్టుబడ్డ అల్ఫాజోలం కోసం విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
Online Betting: వరంగల్ జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి అయ్యాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో అనే లైశెట్టి రాజు కుమార్ (26) అనే యువకుడు.. ఆన్ లైన్ బెట్టింగులో సుమారు 30 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Arogyashri: కార్పొరేట్ హాస్పిటల్స్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు ఆరోగ్యశ్రీ సీఈవోకు లేహాస్పిటల్స్ అసోసియేషన్ ఖ రాసింది. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఈ సంవత్సర కాలంలో అత్యధికంగా రూ. 1130 కోట్లు హాస్పిటల్స్కు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
Heavy Rush: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ప్రయాణికుల రద్దీతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండగ నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది.
RTA Raids: రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడో రోజు రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్- ఆరంఘర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల కొరడా ఝలిపిస్తున్నారు.
Fraud: తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. GBR పేరుతో నకిలీ వెబ్ సైట్ తో పెట్టుబడుల ఆశతో.. వాట్సాప్ గ్రూపుల ద్వారా లాభాలు అంటూ ప్రచారాలు చేశారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు అంటూ అత్యధిక లాభాలు అంటూ 43 మందికి పైగా టోకరా పెట్టారు.
దానం నాగేందర్... గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయనది డిఫరెంట్ పొలిటికల్ స్టైల్. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం అలవాటని చెప్పుకుంటారు. పార్టీలు, లాయల్టీలు జాన్తానై.. పని జరగడమే మనకు ముఖ్యం అన్నట్టుగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఎథిక్స్, యాలక్కాయలు తర్వాత సంగతి.... ముందు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాల్రా భై... అంటారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆయన మీదున్న అభిప్రాయం అట. అందుకు తగ్గట్టే... తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా వేసుకున్న కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి...…