మాజీ మంత్రి పేర్నినానికి షాకిచ్చిన పోలీసులు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి షాకిచ్చారు పోలీసులు.. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారంటూ చిలకలపూడి పోలీసు స్టేషన్లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.. అయితే, వైసీపీ నేత సుబ్బన్నను నిన్న (శుక్రవారం) విచారణకు పిలిచారు మచిలీపట్నం టౌన్ పోలీసులు.. ఈక్రమంలో ఆ పీఎస్‌కు వెళ్లిన పేర్ని నాని.. సీఐపై సీరియస్ అయ్యారు.. ఓ దశలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు…
విజయవాడ మెట్రో ప్రాజెక్టులో మరో కీలక అడుగు.. విజయవాడ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడబోతోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్‌పై వేగం పెంచిన ఏపీఎంఆర్సీ.. ఈ నెల 14న టెండర్లకు ముహూర్తం ఖరారు చేసింది. ఏలూరు రోడ్, బందరు రోడ్ ఈ రెండు కారిడార్లకు కలిపి ఒకే సింగిల్ టెండర్ విధానం ద్వారా ప్రక్రియను చేపట్టనుంది. సుమారు రూ.4,500 కోట్ల వ్యయంతో టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రీ-బిడ్డింగ్ మీటింగ్‌లో 10కి పైగా బడా…
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ వచ్చిందని వృద్ధురాలిని నమ్మించి మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు చోరీ చేశాడు ఓ అగంతకుడు. మాయ మాటలు చెప్పి రూ. 4,000 పెన్షన్ మంజూరు అయ్యిందని ఫొటో దించాలని నమ్మబలికి దొంగతనానికి పాల్పడ్డాడు. వృద్ధురాలితో మాట్లాడిన దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు శంకరమ్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:Hamas:…
* మహిళల వన్డే వరల్డ్ కప్: నేడు శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్.. మధ్యాహ్నం 3 గంటలకు కొలంబో వేదికగా మ్యాచ్ * ఢిల్లీ: ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై చర్చ.. తెలంగాణలోని జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపైనా చర్చించే అవకాశం * నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు.. హైకమాండ్ పెద్దలతో భేటీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై చర్చ * విజయవాడ:…
టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ కాలనీలో ఒక డీసీఎం డ్రైవర్ లేబర్ లతో కలిసి సత్య మ్యాగ్నము నుంచి రాహుల్ కాలనీలో రెండవ అంతస్తుకి లిఫ్ట్‌లో సామాన్లు తీసుకెళ్లారు. ఇది గమనించిన కామ్రాన్ అనే వ్యక్తి లేబర్ల పై దుర్భాషలాడి వారిపై చేయి చేసుకున్నాడు. లేబర్లను ఎందుకు కొట్టారని డీసీఎం డ్రైవర్ ఫారుక్ వెళ్లి ప్రశ్నించగా కామ్రాన్ ఫారూఖ్ ని ఎయిర్ గన్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన డీసీఎం డ్రైవర్ ఫారుఖ్ వెంటనే…
శంషాబాద్ విమానాశ్రయంలో మరో మారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయ్యింది. అంటోనోవ్ ఎన్ 124 సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటోనోవ్ ఎన్ 124 ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలలో ఒకటి. క్వాడ్ ఇంజిన్ అంటే 4 ఇంజన్లు ఉన్నాయి. 24 చక్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాలలో ఒకటి, దీనిలో లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్, అన్లోడ్ కోసం రాంప్‌లను ఉపయోగించి…
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కగార్ ఆపరేషన్ తో మావోలు అడవిని వీడి జనంబాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా మరో ముగ్గురు సీనియర్ మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు జన జీవన స్రవంతి లో కలిశారని తెలిపారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్…
ప్రభుత్వాఫీసుల్లో లంచగొండి అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. వేలు, లక్షల్లో లంచాలు పుచ్చుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని అవగాహన కల్పించాల్సిందిపోయి కంచె చేను మేసినట్లుగా లంచాలకు తెగబడుతున్నారు కొందరు అధికారులు. తాజాగా తార్నాకలోని టీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు సుధాకర్ రెడ్డి. కొత్త ట్రాన్స్ఫర్మర్ కోసం కాంట్రాక్టర్ వద్ద రూ. 15000…
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామనికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులు, రాజు, రాజేశం అనే వ్యక్తులకు జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 15000/- రూపాయల జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ తీర్పు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుర్గయ్య ( 60 )సంవత్సరాల వ్యక్తి అదే గ్రామంలో బండ కొట్టే పనిచేస్తూ జీవనం…
యాదాద్రి జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఉప్పల్ కు చెందిన బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణం అతను తన తల్లిని కొట్టడమే. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా రాజు తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తన తల్లి కొట్టొద్దని వేడుకున్నా సరే విచక్షణ కోల్పోయి తల్లిని చెంప మీద కొట్టాడు. కాలితో తన్నాడు. అయితే ఈ సమయంలో అక్కడున్న…