ప్రధాని మోడీతో ముగిసిన చంద్రబాబు భేటీ.. హస్తినకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 45 నిముషాల పాటు ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశం జరిగింది.. ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు ప్రధాని మోడీ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి , భ్రమరాంబికా దేవిని దర్శించుకోనున్న ఆయన.. కర్నూలులో నిర్వహిస్తున్న “సూపర్…
ఈరోజు సాయంత్రం 5 గంటలకు “బీజేపి పార్లమెంటరీ బోర్డు” సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే బీజేపి పార్లమెంటరీ బోర్డు సమవేశంలో కీలక నేతలు పాల్గొననున్నారు. సమావేశంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజనాధ్ సింగ్, డా. లక్ష్మణ్ లాంటి తదితర సీనియర్ కీలక నేతలతో పాటు, పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ”కి చెందిన ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. Also Read: Kadapa : కడపలో సంచలనం..! గుట్టుచప్పుడు కాకుండా సిజేరియన్లు…
సిద్దిపేట జిల్లా ములుగులో దారుణం వెలుగుచూసింది. పెళ్లైన 13 రోజులకే ఓ యువతి గర్భం దాల్చింది. భర్త నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఘటనలో సినిమా రేంజ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ యువతికి పెళ్లికి ముందే ఉదయ్ కిరణ్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరో యువకుడు పవన్ కళ్యాణ్ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: Andhra Pradesh : ఏపీలో…
రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం రేపు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. రేపటి నుంచి మొదలు 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎన్నికల సంఘం. షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. Also Read:…
మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలను వేధిస్తూ, అత్యాచారాలకు ఒడిగడుతున్నారు దుండగులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నిన్న అత్యాచారానికి గురైన మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిన్న కుల్చారంలో అత్యాచారం అనంతరం వివస్త్రని చేసి మహిళను బండ రాయికి కట్టేసి పారిపోయారు దుండగులు. Also Read:Anantapur: పిల్లల మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్ లో కేసులు.. చివరికి…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని, మరలా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పాలనా పరంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏనాడూ సచివాలయానికి రాలేదని, కేవలం వారి ఇళ్ల నుంచే పరిపాలన కొనసాగించారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. సదాశివ పేట పట్టణంలోని…
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ లో పోలీసుల సమయస్ఫూర్తి ఓ మహిళా ప్రాణాలను కాపాడింది. ఏవో కారణాలతో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు డయల్ 100కి కాల్ చేసి మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంటుందని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు 5 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఇంటి తలుపులు పగలగొట్టారు. అప్పటికే మహిళ ఉరివేసుకుని ఉండటంతో కిందికి దించి పోలీసులు సీపీఆర్ చేశారు. Also Read:Nobel Peace…