రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న భీమేశ్వర ఆలయంలో అక్రమ దర్శనాలపై ఆలయ అధికారుల కొరడా ఝుళిపించారు. బ్రేక్ దర్శనాలు చేపిస్తామని భక్తుల వద్ద డబ్బులు దండుకుంటున్న ఏడుగురు పై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. భీమేశ్వరాలయంలో భక్తుల వద్ద నగదు తీసుకొని అక్రమంగా దర్శనాలను చేయిస్తుండగా ఆలయ ఎస్పీఎఫ్ భద్రత సిబ్బంది పలువురిని పట్టుకున్నారు.
Also Read:Bans Harmful Chemicals in Agarbatti : అగరబత్తుల తయారీపై కేంద్రం సంచలన నిర్ణయం
భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్న వైనం. బ్లాక్ లో టికెట్లు అమ్మేవారి మాటలు నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. దేవస్థానం వారు సూచించిన కౌంటర్లోనే టికెట్లు కొనుగోలు చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవాలయ పరిసరాల్లో బ్లాక్ టికెట్లు అమ్మితే ఊరుకునేది లేదు, తొందరగా దర్శనాలు చేపిస్తామని చెప్పేవారి మాటలు నమ్మొద్దని పోలీసులు సూచించారు.