తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జులు మారుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో నాయకులని సమన్వయ పరుస్తూ నడిపించిన థాక్రే ను ఫలితాలు రాగానే పంపించేశారు. అప్పటివరకు తెలంగాణ ఎన్నికల పరిశీలకురాలిగా ఉన్న దీపా దాస్ మున్షీ ఆ తర్వాత ఇన్చార్జిగా అదనపు బాధ్యతలతో నిన్నటి వరకు వ్యవహరించారు. అయితే.. దీపాదాస్కు అధిష్టానం మంచి అవకాశాన్ని ఇచ్చినా... పూర్తి స్థాయిలో పార్టీని, నాయకత్వాన్ని సమన్వయ పరచలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండటంతో దశరథ్(26) పై తండ్రి కక్ష పెంచుకున్నాడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పలు కీలక అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు.
నిజామాబాద్ మార్కెట్ యార్డులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పై కార్మికులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేసి కార్మికులు ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో కిషన్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. అన్ని జేఏసీ సంఘాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
ఎండాకాలం సమీపించింది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు దగ్గర బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంతో పోలీస్ బూత్ దిమ్మెల్ని ఢీకొట్టాడు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఏఐసీసీ పిలుపుతో ఆయన హస్తినకు వెళ్లినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఈరోజు (ఫిబ్రవరి 15) పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు.