ఆదర్శదంపతులుగా నిండు నూరేళ్లు కలకాలం జీవించాల్సిన వారు అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకుంటున్నారు. పరాయి వాళ్ల మోజులో పడి ప్రాణాలు కూడా తీస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అంబర్ పేటలో ఓ భర్త తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆ భర్త. తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.
Also Read:Trump-Putin: ఈ వారంలో ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు జరిగే ఛాన్స్
అయితే ఈ దారుణ ఘటనలో భార్య వాంగ్మూలంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నవీన్ మద్యానికి బానిసై భార్య రేఖను నిత్యం వేధిస్తుండేవాడు. చంపుతానని బెదిరింపులకు పాల్పడేవాడు. భర్త ఆగడాలతో విసుగుచెందిన భార్య రేఖ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది. అయినప్పటికీ నవీన్ లో మార్పు రాలేదు. ఈ క్రమంలో నవీన్ తన భార్యతో మరోసారి గొడవపడ్డాడు. భార్యను అంతమొందించాలని ముందుగానే ప్లాన్ చేసిన నవీన్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ భార్యపై పోసి నిప్పంటించాడు.
Also Read:AP 10th Exams 2025: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. చివరి నిమిషం వరకూ అనుమతి, ఉచిత బస్సు సౌకర్యం!
ఆ తర్వాత తనతో గొడవ పడి ఆత్మహత్యా యత్నం చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. నిజామాబాద్ లో ఉండే అత్త, మామలకు ఫోన్ చేసి.. మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని నవీన్ చెప్పాడు. అల్లుడిపై అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేఖ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నవీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.