Mukunda Jewellers: బంగారు ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం ఫిబ్రవరి 14న పేట్ బషీరాబాద్, సుచిత్రలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ చేతుల మీదుగా ముకుంద జ్యువెల్లర్స్ షోరూం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి జీడిమెట్ల కార్పొరేటర్ సి. తారా చంద్ర రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే కూకట్పల్లి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ. హనుమకొండలలో బ్రాంచ్‌లను కలిగి ఉన్న ‘ముకుంద జ్యువెల్లర్స్’..…
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఏడాది పాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. గత ఆరు సంవత్సరాల్లో పీక్ డిమాండ్ 2022 – 23లో 15370 మెగావాట్లు వచ్చింది. దీనికే…
తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు కులగణన అంశమే హాట్ సబ్జెక్ట్. జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించగా... వివిధ కారణాలతో కొందరు పాల్గొనలేకపోయారు. కుదరక కొందరైతే... ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసిన వాళ్ళు మరి కొందరు. అలా వివరాలు ఇవ్వని వారికోసం మరోసారి సర్వే చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఈ విషయంలో కూడా రాజకీయాలు మొదలయ్యాయి.
రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. ఏపీ విభజన సమయంలో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందన్నారు. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైందని తెలిపారు. "నేను ఏ పార్టీని తప్పు పట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే.
మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఏం చేస్తున్నట్లు? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో బస్తీ దవాఖానాల పనితీరు దుర్భరంగా ఉందని.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. తాజాగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.