మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని అన్నాడు. ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ గా ఉన్నాడని వెల్లడించాడు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు.
Also Read:Pawan Kalyan: ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టా.. అధికారులపై చర్యలు తప్పవు!
రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలువదా?.. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు. ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయ 5 కే మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పదేళ్ళు అధికారంలో ఉన్న మాకు ఎవరు ఎంటో అన్నీ తెలుసునని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదు అని అడిగారు.
Also Read:Pope Francis: ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఫొటో విడుదల చేసిన వాటికన్
70 వేల కోట్ల లోటు ఉంది అని సీఎం ఒప్పుకున్నాడు. బడ్జెట్ ముందే ఇలా లీక్ చేస్తారా.. సంపద సృష్టించే జ్ఞానం లేదు. మెదడు లో గుజ్జు లేదు. ఈ సంవత్సరం మొత్తం నెగటివ్ పాలిటిక్స్ చేశారు. పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం తయారైంది. ఇప్పుడు కోవిడ్ లాంటిది ఏమైనా ఉందా.. సీఎం అప్రూవర్ గా మారి నేర అంగీకారం చేశారు. ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ మీద ఉన్న కోపంతో పంటలు ఎండబెట్టారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం అవడానికి సీఎం వైఖరినే కారణమని మండిపడ్డారు. కేంద్రం సఖ్యతతో సాధిస్తాను అన్నావ్.. ఏమి సాదించావ్ అని సీఎంను ప్రశ్నించారు. 2014 లో ప్రజలు ఆలోచించి కేసీఆర్ ను గెలిపించారు కాబట్టే ఈ పదేళ్లలో పునాదులు గట్టిగా పడింది.
Also Read:BRS: మెడలో మిర్చి దండలు వేసుకొని.. కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
ఇంత మంచి పునాది ఉన్నా…ఈ కాంగ్రెస్ ఘోరంగా విఫలం అయింది. ముఖ్యమంత్రి గాసిప్స్ మానేసి గవర్నెన్స్ మీద సోయి పెట్టాలని సూచించారు. సీఎం కు ఇప్పుడు భార్య పిల్లలు ఇప్పుడు గుర్తొచ్చారా
మాకు లేరా భార్యా పిల్లలు. నాకు వేరే వాళ్ళతో లింక్ పెట్టినప్పుడు ఏమైంది ఈ జ్ఞానం.నా భార్య పిల్లలు ఎంత నొచ్చుకొని ఉంటారు. నేను చెప్పాలంటే చాలా చెప్తా. ఢిల్లీ లో దూకిన గోడలు, సాగర్ సొసైటీ లీలలు అన్ని నాకు తెలుసు. అవసరం వచ్చినప్పుడు బయట పెడతాను అంటూ సీఎం రేవంత్ పై కేసీఆర్ విరుచుకుపడ్డారు.