Shivaji Maharaj Jayanti: మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి, ధర్మ స్థాపన కోసం సామ్రాజ్యం స్థాపించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ 395వ జయంతి నేడు. అయితే, ఛత్రపతి శివాజీ తెలుగు నేలపై నడయాడినట్లు తెలుస్తుంది.
Electricity Demand: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరగడంతో 16000 మెగావాట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో సరఫరా పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 19 ఉదయం 7 గంటల 55 నిమిషాలకు 16058 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదే నెల 10వ తేదీన 15998 మెగావాట్లు నమోదు కాగా తాజా డిమాండ్ ఆ రికార్డును అధిగమించింది. గత ఏడాది…
జీహెచ్ఎంసీ పరిధిలోని తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫోకస్ మారుతోందా? అంటే...వాతావరణం అలాగే కనిపిస్తోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. పాలిటిక్స్ ఒక ఎత్తయితే... పోలీస్ బాసులు, వాళ్ళ పనుల మీదికి దృష్టి మళ్ళుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. మొన్న ఎమ్మెల్యే,ఇప్పుడు పార్టీ సీనియర్ లీడర్. వరుసగా చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ స్టేట్మెంట్స్ని విశ్లేషిస్తుంటే...
అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై సమీక్ష చేశారు. వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాలలో వేసవిలో సరఫరాకు డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ లభ్యత తగినంత పరిమాణంలో ఉందని సీఎస్ కలెక్టర్లకు తెలిపారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధం అవుతుంది.. రేపటి నుండి (బుధవారం) 23వ తేదీ వరకు పంచకుండాత్మక నృసింహ మహా యాగం జరిపించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేయనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువును నిర్వహించనున్నారు.
తెలంగాణలో ఈ నెల 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు.అభ్యర్థులను పెట్టే దమ్ములేదని అన్నారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు. అబ్దుల్ కలాంను అవమానించిన అమెరికా స్థాయి నుంచి మోడీని గౌరవించిన…
HYDRA : ఫార్మ్ ప్లాట్లు పేరిట అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొనొద్దని ప్రజలకు హైడ్రా సూచన చేసింది. అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దన్న హైడ్రా పేర్కొంది. నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని.. వీటిని కొన్న వారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హైడ్రా హెచ్చరించింది. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేదం ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్…